కొత్త ఐడియాలు వారి బిజినెస్ ని పెంచడమే కాదు..పర్యావరాన్ని పరిరక్షించే పనిని చేస్తోంది. ఇది ఓ కేఫ్ యజమాని తీసుకున్న నిర్ణయం. ఈ కేఫ్ లో మనకి నచ్చింది తినొచ్చు..తాగొచ్చు..అయితే ఇందుకు నగదుని చెల్లించాల్సి ఉంటుదన్న సంగతి తెలిసిందే. అయితే మన దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదట..ప్లాస్టిక్ చెత్తని తీసుకొచ్చి ఇస్తే చాలట..వినడానికి వింతగా ఉన్నా..ఇది అక్షరాల నిజమండీ. ఇంతకీ ఈ కేఫ్ ఎక్కడ ఉందో తెలుసా.. గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలో ఈ నెల 30న వెలుస్తుంది ఒక కేఫ్.ఇంట్లో ప్లాస్టిక్ చెత్త ఉంటే, ఓ సంచిలో వేసుకుని జునాగఢ్ లోని ఈ కేఫ్ కు వెళితే సరి.
జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వినూత్న ప్రయత్నమే ఈ కేఫ్. దీని వల్ల ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన సైతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేఫ్ లోని ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూడనుంది. పర్యావరణంగా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్ ను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని అధికారులు చెప్పారు. కాగా ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ కేఫ్ తీసుకున్న నిర్ణయం భేష్ అంటున్నారు నెటిజన్స్.