Friday, November 22, 2024

ముగిసిన క్యాబినెట్ స‌మావేశం – ప‌లు కీల‌క నిర్ణ‌యాలు ఇవే

ఏపీ క్యాబినెట్ స‌మావేశం ముగిసింది. సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ మీటింగ్ జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు మంత్రి మండ‌లి ఆమోదాన్ని తెలిపింది. ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు క్యాబినెట్ సమ్మతించింది. ప్రభుత్వ ఉద్యోగులకు హౌసింగ్ పై ఆమోద ముద్ర వేసింది. అటు, కరోనా కట్టడిపైనా సీఎం జగన్ మంత్రివర్గం చర్చించింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు.ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. జగనన్న టౌన్ షిప్పులలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగులతో చర్చలకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద మహిళలకు రూ.45 వేల ఆర్థికసాయం అందించ‌నున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున సాయమందిచ‌నున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో ఐదు ఎకరాల భూమి కేటాయించారు. విశాఖలో అదాని డేటా సెంటర్ కు భూమి కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం .వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement