తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆమోదం లభించిందన్నారు. దీంతోపాటు అమిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) , గురునానక్, నిప్మర్, ఎంఎన్ఆర్ యూనిర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.
ఇందుకు సంబంధించిన జీవోలు, విధివిధానాలను సంబంధిత మంత్రులే చూసుకుంటారని చెప్పారు. అలాగే, ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయని సీఎం కేసీఆర్ వివరించారు.