ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరగడం లేదు..అయితే శీతాకాల సమావేశాలకు ముందే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ ఆర్డినెన్స్ పై సంతకం చేయడం గమనార్హం..సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లను విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) డైరెక్టర్ల పదవీకాలం 5 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఈ పోస్టుల గరిష్ట కాలపరిమితి 2 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుత సమయంలో ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి సరిగ్గానే పరిగణించారు. అయితే, వారి పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇద్దరికి సర్వీసు పొడిగింపు ఇవ్వరు.
ఇప్పుడు రాబోయే టాప్ ఏజెన్సీల అధిపతులందరి పదవీకాలం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, వారిని మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నారు. ఆయన మే 2021లో డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈడీ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా నవంబర్ 2018లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. మిశ్రా 1984 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి. గత ఏడాది నవంబర్‌లో అనూహ్య నిర్ణయంతో మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. మిశ్రా పదవీకాలం నవంబర్ 2020తో ముగిసింది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily