Saturday, November 23, 2024

వచ్చే ఏడాది మార్చి నాటికి.. 25కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం భారత్ లో మూడు వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే మరో 25 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్త వందేభారత్ రైళ్లను పరుగులు తీయించాలన్నది రైల్వే శాఖ ప్రణాళిక. వందేభారత్ 2.0 రైళ్లను చెన్నైలోని ఇంటెగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో రూపొందిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 27 వందేభారత్ రైళ్లను తయారుచేయాలని ఐసీఎఫ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019లో దేశంలో తొలి వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది న్యూఢిల్లీ-వారణాసి మధ్య ప్రయాణిస్తుంది. రెండో వందేభారత్ రైలును న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి మార్గంలో ప్రవేశపెట్టారు. ఇటీవల ప్రధాని మోడీ మూడో వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇది గాంధీ నగర్-ముంబయి మార్గంలో ప్రయాణిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement