యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బిగ్ స్టెప్ తీసుకుంటోంది. బడా వ్యాపారవేత్తలకు ఇది షాక్ వంటి న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే వ్యాపార సంస్థలకు స్వేచ్ఛగా బిజెనెస్ చేసుకునే చాన్స్ కల్పించనున్నట్టు తెలుస్తోంది. దిగుమతి చేసుకున్న వస్తువుల అమ్మకంపై బడా సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. వాణిజ్య ఏజెన్సీ ఒప్పందాల ఆటోమెటిక్ రెన్యువల్ కు ముగింపు పలికే చట్టాన్ని యూఏఈ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు సమాచారం. దీంతో విదేశీ కంపెనీలు తమ సొంత వస్తువులను పంపిణీ చేయడానికి, లేదా కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత వారి స్థానిక ఏజెంట్‌ను మార్చడానికి వీలు కల్పించే అవకాశం ఉంటుంది.
ఎమిరాటీ లీడర్ షిప్ ద్వారా ఒక చట్టం అప్రూవ్ అవుతుందని అంతా భావిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు. అయితే ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ఇప్పుడే దీనిపై ఎట్లాంటి కామెంట్ చేయలేమని అంటున్నారు. కాగా, ఈ సమాచారాన్ని UAE ప్రభుత్వం ఇంకా ధ్రువీకరించలేదు. గల్ఫ్ దేశంలో ఫ్యామిలీ ఓన్డ్ బిబినెస్ లున్న యాజమాన్యాలే అత్యధికంగా వ్యాపార సంస్థలు కలిగి ఉన్నాయి. కార్ డీలర్‌షిప్‌ల నుండి సూపర్ మార్కెట్ చైన్ ఫ్రాంచైజీల దాకా ఇట్లాంటి బిజినెస్ లు ఎక్కువగా ఉంటాయి.
UAEలో భాగమైన దుబాయ్‌లోని ప్రసిద్ధ కుటుంబ -యాజమాన్య వ్యాపారాల్లో కొన్ని, మధ్య ప్రాచ్యంలోని క్యారీఫోర్ SA స్టోర్‌ల నిర్వాహకుడు మాజిద్ అల్ ఫుట్‌టైమ్ హోల్డింగ్, హోటళ్లు, ఆస్తులు, కార్ డీలర్‌షిప్‌లను కలిగి ఉన్న అల్ హబ్టూర్ గ్రూప్ వంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయంతో పలు బడా సంస్థల గుత్తాధిపత్యానికి ఇక చెక్ పడనుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.