భోపాల్ ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 28మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్ పూర్ లో చోటు చేసుకుంది. ఉదేపూర్ నుండి అలీరాజ్ పూర్ కి బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. కాగా ఈ మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. అలీరాజ్‌పూర్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు ను నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని ఎస్పీ చెప్పారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.
అలీరాజాపూర్ లోని లఖోడా నదిలో 30 ఫీట్ల ఎత్తుపై ఉన్న బ్రిడ్జి నుండి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో జోబాట్ కి చెందిన కైలాష్, అతని భార్య మీరాబాయ్, ఏడాది చిన్నారి సంఘటన స్థలంలోనే మరణించారని పోలీసులు తెలిపారు.సంఘటన స్థలంలో సహాయక బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టుగా సీఎం చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్టుగా సీఎం వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..