Friday, November 22, 2024

బ‌స్సు డ్రైవ‌ర్ కి హార్ట్ ఎటాక్.. ఇద్ద‌రు మృతి

ఊహించ‌ని ప‌రిణామం.. బ‌స్సు న‌డుపుతుండ‌గా డ్రైవ‌ర్ కి గుండెపోటు వ‌చ్చింది. దాంతో అత‌ను డ్రైవింగ్ సీటులోనే క‌న్నుమూశారు. కాగా బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో బస్సును అతడి కంట్రోల్ లేకుండా పోయింది. ఎదురుగా వచ్చే వాహనాలపైకి దూసుకెళ్లింది. పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇద్దరు మరణించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. జబల్‌పూర్‌లో జిల్లాలో దమోహ్నక నుండి బరేలా మార్గంలో ఓ మెట్రో సిటీ బస్సు ప్రయాణిస్తోంది. గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోకి చేరుకునేసరికి 50 ఏళ్ల డ్రైవర్ హర్దేవ్ పాల్ కు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అతడు డ్రైవింగ్ సీట్లో ఉండగానే మరణించాడు. బస్సు ప్రయాణంలో ఉండటంతో కంట్రోల్ కాలేదు.

ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతూ వెళ్లింది. ఇలా బస్సు వాహనాలను ఢీకొడుతూ వెళ్లిన దృష్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా బస్సు ఢీకొట్టడం వల్ల ఇద్దరు చనిపోయారు. అనేక మందికి గాయాలు అయ్యాయి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ లు ఆగి ఉన్న సమయలో ఇది చోటు చేసుకుంది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డ్రైవింగ్ సీటులో కూర్చున్న హర్దేవ్ పాల్ ను బయటకు తీసుకొచ్చి, హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆయన అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాగా.. 20 పీఏ 0764 నెంబర్ గల బస్సు రాణిటాల్‌కు వెళ్తోందని, డ్రైవర్ హర్దేవ్ పాల్ సింగ్‌కు గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని జబల్‌పూర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ సీఈవో సచిన్ విశ్వకర్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement