మినీ బస్సు డ్రైవర్ కి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతను కిందపడిపోయాడు. ఆ బస్సులో మహిళలు, పిల్లలు ఉన్నారు. దాంతో బస్సులో ఉన్న యోగితా సతవ్ అనే మహిళా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బస్సు స్టీరింగ్ ని అందుకుని పది కిలోమీటర్లు బస్సు నడిపి డ్రైవర్ ని హాస్పటల్ కి తరలించి ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. యోగిత ఇతర మహిళలు , పిల్లలతో కలిసి షిరూర్లోని వ్యవసాయ పర్యాటక ప్రదేశంలో విహారయాత్ర చేసి బస్సులో తిరిగి వస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ సమయంలో, డ్రైవర్‌కు స్ట్రోక్ రావడంతో ఏకాంత ప్రదేశంలో బస్సును ఆపాల్సి వచ్చింది. నాకు కారు నడపడం తెలుసు అని యోగిత చెప్పింది. పిల్లలు, మహిళలు భయాందోళనలకు గురికావడం చూసి, నేను బస్సును నడపాలని నిర్ణయించుకున్నాను. యోగిత కూడా ఇతరులను వారి ఇంటి వరకు దింపింది. విపత్కర సమయాల్లో, భయాందోళనలకు గురికాకుండా తెలివిగా వ్యవహరించినందుకు యోగితను ప్రజలు అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..