ఆర్టీసీ బస్సులో భారీ వస్తువులను ఏవైనా తీసుకువెళితే.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే, బస్సుల్లో మనుషులకే కాకుండా పెంపుడు జంతువులకు టికెట్ తీసుకోవాలనే విషయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ వింత సంఘటన కర్ణాటకలో జరిగింది.
హోసనగర నుంచి షిరూరుకు బస్సులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం.. తమతోపాటు కోడిపిల్లను తీసుకువెళ్లిందని దానికి హాఫ్ టికెట్ ఇచ్చాడు కండక్టర్. బస్సులో కోడిపిల్లకు టికెట్ తీసుకోవాలనే నియమం ఉందని కండక్టర్ చెప్పడంతో.. దానికి హాఫ్ టికెట్ తీసుకుంది ఆ కుటుంబం. అయితే, ఆ కోడిపిల్లను రూ.10 రూపాయలకు కొనుగోలు చేసి.. దానికి రూ.50 పెట్టి దానికి టికెట్ తీసుకోవడమే గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital