బస్సు అదుపుతప్పి లోయలో పడింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు..మరో 30మంది గాయపడ్డారు.ఈ సంఘటన గుజరాత్ డాంగ్ జిల్లా సపుతర హిల్ స్టేషన్ సమీపంలో టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బస్సు టైర్లు పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ణారణకు వచ్చారు. టైరు పగిలి బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.
గాయపడిన వారికి సపుతర, సంఘన్‌లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తెలిపారు. గుజరాత్ క్యాబినెట్ మంత్రి పూర్ణేష్ మోడీ ఈ సంఘటన గురించి వాట్సాప్ సందేశంలో తెలియజేశారు. దీనితో పాటు, ఈ రహదారి చుట్టూ ఉన్న రహదారి నిర్మాణ కార్మికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు. అయితే, సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక యంత్రాంగం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు రహదారులు మూసుకుపోవడంతో పాటు పలుచోట్ల కొండలపై నుంచి రాళ్లు రోడ్లపై పడ్డాయి. అటువంటి పరిస్థితిలో, రోడ్లు కూడా బ్లాక్ చేయబడ్డాయి.