Tuesday, November 26, 2024

రెండు బ‌స్సులు ఢీ – 16మంది మృతి – ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

రెండు బ‌స్సులు ఢీకొన‌డంతో 16మంది మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న ఆఫ్రికా దేశం ఈజిప్టులో చోటు చేసుకుంది. పొగ‌మంచు ఉన్న స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌భుత్వ ర‌వాణా బ‌స్సు , మ‌రో మినీ బ‌స్సు అత్య‌ధిక వేగంతో ప్ర‌యాణిస్తూ ఒక‌దాన్ని ఒక‌టి ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 18మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న సినాయ్ పెనిన్సులా ఏరియాలో జరిగింది. మినీ బస్సు, మరో కోచ్ బసు రెండు కైరో నుంచి షర్మ్ ఎల్ షేక్‌లో రెడ్ సీ టూరిస్టు రిసార్ట్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్ విజిబిలిటీలో అత్యధిక వేగంతో ప్రయాణించిన ఆ రెండు బస్సులో ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. కైరో నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఎల్ టోర్ నగర సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఎల్ టోర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.

ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీసు వెల్లడించింది. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఆపరేటింగ్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఘటనా స్థలికి వెంటనే 13 అంబులెన్సులను పంపించినట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎల్ టోర్‌లోని అల్ జహరా హాస్పిటల్‌కు క్షతగాత్రులను తరలించినట్టు తెలిపింది. ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు అత్యధికంగా ఉన్నాయి. అలాగే, రోడ్ల పరిస్థితులూ అధ్వాన్నంగా ఉంటాయి. అందుకే ఇక్కడ యేటా భారీగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement