ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక రోగి మృతి చెందింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని బర్ద్వాన్ మెడికల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కొవిడ్ వార్డులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. కొవిడ్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు బయటికి పరుగులు తీశారు. చూస్తుండగానే.. మంటలు వార్డు మొత్తం వ్యాపించాయి. దాదాపు కదల్లేని స్థితిలో ఒక కొవిడ్ రోగి మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. ఆమెను తూర్పు బుర్ద్వాన్ జిల్లాకు చెందిన సంధ్యా రాయ్ (60)గా గుర్తించారు.
దాంతో సంఘటనాస్థలానికి అగ్నిమాపక శాఖ, పోలీసులు చేరుకున్నారు. కొవిడ్ వార్డులో మంటలను అదుపు చేయడానికి దాదాపు గంట సమయం పట్టిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే కారణాన్ని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఫోరెన్సిక్ విచారణ కూడా జరుగుతోందని బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపల్ ప్రబీర్ సేన్‌గుప్తా వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..