న్యూయార్క్: సోషల్‌మీడియా సెర్చ్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు అదనపు స్టాఫ్ బోనస్ ప్రకటించింది. అదనపు బోనస్‌లు గూగుల్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా, కంపెనీ విస్తరించిన సిబ్బంది, కోచ్‌లకు కూడా అందించనున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ అల్ఫాబెట్ ఇంక్ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ తన ఉద్యోగులకు ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. కరోనా ముప్పు ఉన్న సమయంలోనూ తమ సంస్థ కోసం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆర్థికంగా అండగా నిలిచేందుకు గూగుల్ ముందుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులుతోపాటు ఎక్స్‌టెండ్ వర్క్‌ఫోర్స్, ఇంటర్న్స్‌కి కూడా వన్ టైమ్ క్యాష్‌బోనస్‌గా ప్రతి ఒక్కరికి 1600 యూఎస్ డాలర్లు (రూ.1లక్ష 21వేలు) బోనస్‌ను ఈనెల అందించనున్నట్లు పేర్కొంది.
వర్క్‌ఫ్రమ్ హోం అలవెన్స్, సంక్షేమ బోనస్‌తోపాటు ప్రకటించినవిధంగా అడిషనల్ బోనస్ అందించనున్నారు. కాగా గూగుల్ మార్చి 2021లో చేపట్టిన అంతర్గత సర్వేలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగుల ఆరోగ్యం ప్రతికూల ప్రభావితమైందని, అందుతున్న బెనిఫిట్స్ బాగోలేవని నివేదిక అందింది. దీంతో గూగుల్ తమ ఉద్యోగులకు వెల్‌బీయింగ్ బోనస్ కింద 500 డాలర్లు (రూ.37వేలు) అందించింది. ఈ ఏడాది జనవరి 10నుంచి ఉద్యోగులును కార్యాలయాలకు రావాలని ఆదేశించిన గూగుల్, ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలను సైతం పక్కనపెట్టింది. వన్ టైమ్ క్యాష్ బోనస్‌ను యునైటెడ్ స్టేట్స్ ఉద్యోగులు మాత్రమే కాకుండా ఇతర దేశాల ఉద్యోగులు 1600 యూఎస్ డాలర్లుకు సమానమైన తమ దేశ కరెన్సీని అందుకుంటారు. అంతర్గత సరే నివేదిక తర్వాత కంపెనీ ఉద్యోగులకు రూ.37.74 సంక్షేమ నగదు బోనస్‌తోపాటు పలు ప్రయోజనాలను గూగుల్ ప్రకటించింది. గత వారమే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్బంధ వ్యాక్సిన్ విషయంలో ఉద్యోగుల వ్యతిరేకత, భయాన్ని ఉటంకిస్తూ కార్యాలయాల్లో 10 జనవరి 2022 నుంచి పనిచేసే ప్రణాళికను నిరవధికంగా వాయిదా వేసింది.