Saturday, November 23, 2024

నేటి బంగారం ధ‌ర‌లు- పెరిగిన వెండి

నేడు బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. వారం ప్రారంభంలో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ధర రూ.46,750గా ఉంటే.. నేడు కూడా అదే స్థాయిలో రేటు పలుకుతోంది. అంటే ధరలు పెరిగినా, ఒక్కసారి తగ్గుదలతో ధరలు సమానమై పోయాయి. అలాగే 24 క్యారెట్ల ధర కూడా వారం ప్రారంభంలో రూ.51 వేలుగా ఉంటే.. నేడు కూడా ఆ రేటు రూ.51 వేలుగానే ఉంది. మరోవైపు సిల్వర్ ధర నేడు రూ.100 పెరిగి రూ.60,400గా ఉంది. ఈ రేటు వారం ప్రారంభంలో రూ.58,500 పలకగా.. ప్రస్తుతం రూ.60 వేలకు పైన రూ.60,400గా నమోదవుతోంది. కేవలం బులియన్ మార్కెట్లలో మాత్రమే కాక.. ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా బంగారం ధరలు కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్నాయి. మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర 0.32 శాతం పెరిగి రూ.50,529 స్థాయికి చేరుకుంది. స్పాట్ గోల్డ్ ధర కూడా 0.28 శాతం పెరిగి 1716.20 డాలర్ల వద్ద నమోదైంది. సిల్వర్ ధరలు కూడా ఎంసీఎక్స్‌పై 3.82 శాతం పెరిగి కేజీ రూ.55,050 స్థాయికి చేరుకున్నాయి. స్పాట్ సిల్వర్ ధరలు కనిష్ట స్థాయిల నుంచి రికవరీ పొందాయి. ఇవి కూడా 4.35 శాతం లాభపడి 18.81 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement