Friday, November 22, 2024

Breaking : ఉక్రెయిన్​లో భారత విద్యార్థికి బుల్లెట్​ గాయం

ర‌ష్యా – ఉక్రెయిన్ వార్ కొన‌సాగుతోంది. ఉక్రెయిన్ ​పై రష్యా సేనలు బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. గ‌త వారం రోజుల‌కు పైగా ఉక్రెయిన్ పై ర‌ష్యా క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే ఈ దాడుల్లో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఆ దేశ రాజధాని కీవ్​లో జరిగిన ఘర్షణల్లో మరో భారత విద్యార్థికి బుల్లెట్​ తగిలింది. తీవ్రగాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్​ వీకే సింగ్​.. పోలండ్​లోని విమానాశ్రయంలో మాట్లాడుతూ వెల్లడించారు. “కీవ్​లో ఓ విద్యార్థికి తూటా తగిలినట్లు తెలిసింది. వెంటనే నగరంలోని ఆసుపత్రికి తరలించిన‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement