రష్యా – ఉక్రెయిన్ వార్ కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తోంది. గత వారం రోజులకు పైగా ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే ఈ దాడుల్లో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఆ దేశ రాజధాని కీవ్‌లో జరిగిన ఘర్షణల్లో మరో భారత విద్యార్థికి బుల్లెట్ తగిలింది. తీవ్రగాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్.. పోలండ్‌లోని విమానాశ్రయంలో మాట్లాడుతూ వెల్లడించారు. “కీవ్‌లో ఓ విద్యార్థికి తూటా తగిలినట్లు తెలిసింది. వెంటనే నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement