ఇది చాలా దారుణమైన బడ్జెట్ ఇదని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రగతిభవన్ లో ఈ మేరకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహాభారతంలోని శాంతి పర్వంలో ఉండే శ్లోకాలు చెప్పారు. బడ్జెట్ లో అందరికీ గుండు సున్నా అని అన్నారు. చెప్పింది శాంతి ధర్మం..ప్రవచించింది మాత్రం అధర్మం అని తెలిపారు. దేశ ప్రజల్ని ఘోరంగా అవమానించారని అన్నారు. ఎరువులపై రూ.35వేల కోట్ల సబ్సిడీని తగ్గించేశారన్నారు. రైతులకి ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు..కానీ బడ్జెట్ లో రైతుల ప్రస్తావన మాత్రం లేదని తెలిపారు. కరోనాతో ప్రజలు దయనీయ పరిస్థితిలో ఉన్నారు..ఉపాధి హామీ పథకంలో రూ.25వేల కోట్లు తగ్గించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..