న్యూఢిల్లి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ నాయకులు, ప్రొఫెషనల్స్, బిజినెస్ లీడర్స్‌తో పాటు పార్టీతో సంబంధం ఉన్న అకడమిషియన్స్, ఎకనమిస్ ్ట్సతో బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో వర్చువల్ డిస్కషన్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సంప్రదింపుల్లో జాతీయ నేతలు, పార్టీ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ బైజయంత్ పాండా, అధికార ప్రతినిధి గోపాల్ క్రిషన్ అగర్వాల్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. థింక్-ట్యాంక్ సభ్యులు, బీజేపీ వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు తమ అభిప్రాయాలు, సూచనలను నిర్మలమ్మకు అందజేశారు.
దాదాపు 20 రాతపూర్వక సమర్పణలు వచ్చాయని, వాటిని పరిశీలించి ఆర్థిక మంత్రికి అందజేస్తామని అగర్వాల్ తెలిపారు. సూచనల నేపథ్యంలో నిర్మలమ్మ.. నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. 2020లో బడ్జెట్ సమర్పణ అనంతరం కరోనా వెలుగు చూసింది. అప్పటి నుంచి భారత్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైంది.