Tuesday, November 26, 2024

సేద్యానికి సై…

న్యూ ఢిల్లీ – 2023-24 వార్షిక బడ్జెట్‌లో మిగతా రంగాలతో పోల్చితే వ్యవసాయానికి నిర్మలా సీతారామన్‌ మరిన్ని ప్రోత్సాహాలు అందిం చారు. అమృత కాలం బడ్జెట్‌లో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు దన్నుగా నిలిచారు. ఉపాధిలో అగ్రపథాన ఉన్న ఈ రంగానికి తీపికబురే ఇచ్చారు. భారతదేశాన్ని చిరుధాన్యాల కేంద్రంగా మారుస్తామని చెప్పడం ద్వారా వ్యవసాయానికి కొత్త ఊపునిచ్చారు. వ్యవసాయం కోసం గతేడాది కంటే 11శాతం ఎక్కువ కేటాయిం పులు ఇచ్చారు. తద్వారా ఈసారి కేటాయింపులు రూ.1.25 లక్షల కోట్లకు చేరాయి. తాజా అంచనాలలో ఆహార సబ్సిడీ రూ.1.97 లక్షల కోట్లుగా నిర్ధారించబడింది. 2022-23 సవరించిన అంచనాలతో పోల్చితే 31.2 శాతం తగ్గింది. అయితే, ఎరువుల సబ్సిడీ రూ.1.75 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. డిజిటల్‌ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, రుణ సౌలభ్యం, మార్కెటింగ్‌, అగ్రిస్టార్టప్స్‌కు చేయూత, ఇందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు వంటి హామీలు ప్రకటించారు. రైతుల స మస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని భరోసా ఇచ్చారు. అలాగే చిరు ధాన్యాల ప్రోత్సాహానికి శ్రీఅన్న పథకాన్ని తెస్తున్నట్లు వెల్లడించారు. మత్స్య శాఖలోని వివిధ వర్గాల ప్రోత్సాహానికి పెట్టుబడులు, ఇతర కేటాయింపులను కూడా ప్రకటించారు.

వాతావరణ మార్పులు, ప్రతికూల ప్రభావాలు, పెరుగుతున్న ఇన్‌పుట్‌ వ్యయం మొదలైన సవాళ్లను అధిగమించడానికి ఈ రంగానికి పున:దిశ అవసరమని నిర్మల అభిప్రాయపడ్డారు. గత ఆరేళ్లలో సగటు వార్షికవృద్ధి 4.6 శాతంగా ఉంది. 2021-22లో వ్యవసాయ ఎగుమతులు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 50.2 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్థికమంత్రి గుర్తుచేశారు.

డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
వ్యవసాయం కోసం డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఓపెన్‌ సోర్స్‌, ఓపెన్‌ స్టాండర్డ్‌, ఇంటర్‌ ఆపరేబుల్‌ పబ్లిక్‌ గుడ్‌గా నిర్మిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. పంట ప్రణాళిక, ఆరోగ్యం, వ్యవసాయ ఇన్‌పుట్‌లు, క్రెడిట్‌, బీమాకు మెరుగైన ప్రాప్యత, పంట అంచనా, మార్కెట్‌ మేధస్సు, వ్యవసాయ- టెక్‌ పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు కోసం సంబంధిత సమాచార సేవల ద్వారా కలుపుకొని, రైతు- కేంద్రీకృత పరిష్కారాలను ఇది అనుమతిస్తుంది.

అగ్రికల్చర్‌ యాక్సిలరేటర్‌ ఫండ్‌
రైతులు ఎదుర్కొ ంటున్న సవాళ్లకు వినూత్నమైన మరియు సరసమైన పరిష్కారాలను తీసుకురావడానికి గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తలచే అగ్రి-స్టార్టప్‌లను ప్రోత్స#హంచడానికి అగ్రికల్చర్‌ యాక్సిలరేటర్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇది వ్యవసాయ పద్ధతులను మార్చడానికి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకువస్తుంది.

- Advertisement -

పత్తి పంట ఉత్పాదకతను పెంపొందించడం
పత్తి ఉత్పాదకతను పెంపొందించడానికి, ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్స్‌ ద్వారా క్లస్టర్‌ ఆధారిత, విలువ గొలుసు విధానాన్ని అవలంబిస్తుంది. రైతులు, రాష్ట్రం, పరిశ్రమల మధ్య ఇన్‌పుట్‌ సరఫరాలు, పొడిగింపు సేవలు, మార్కెట్‌ అనుసంధానాల మధ్య సహకారం పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది.

మిల్లెట్‌ ప్రోగ్రాం..
చిరుధాన్యాల ఉత్పత్తి, ఎగుమతిలో ఇండియా టాప్‌లో ఉంది. #హదరాబాద్‌లో ఉన్న మిల్లెట్‌ రీసర్చ్‌ సెంటర్‌పై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. ఆ కేంద్రాన్ని సెం టర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దనున్నది. టెక్నాలజీ ఆధారిత చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఆ ఇన్‌స్టి ట్యూట్‌ పనిచేయనున్నట్లు తెలిపారు. ఇండియన్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ అన్నాను ఏర్పాటు చేయను న్నట్లు చెప్పారు.
మిల్లెట్స్‌ ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో తృణ ధాన్యాలపై అవగా#హన పెంచేం దుకు కేంద్రం చొరవచూపింది. జొ న్నలు, రాగులు, సజ్జలు, సామలు. అరి కలు, కొర్రలు వంటి మిల్లెట్స్‌ దిగు బడిలో భారత్‌ ముందువరసలో ఉం డగా మిల్లెట్స్‌లో భారత్‌ రెండవ అతి పెద్ద ఎగుమతిదారని పేర్కొన్నారు.

సహకారం
రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్న కారు రైతులు, ఇతర అట్టడుగు వర్గాలకు, ప్రభుత్వం స#హకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి నమూనాను ప్రోత్స హ స్తోంది. ఇప్పటికే రూ.2,516 కోట్ల పెట్టుబడితో 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌) కంప్యూటరీకరణను ప్రారంభించింది. స#హకార సంఘాల మ్యాపింగ్‌ కోసం జాతీయ స#హకార డేటాబేస్‌ తయారు చేయబడుతోంది.

ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌
రూ. 2,200 కోట్ల రూపాయల వ్యయంతో అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలకు వ్యాధి రహత, నాణ్యమైన మొక్కలు నాటే పదార్థాల లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ క్లీన్‌ ప్లాంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement