కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెటన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి హోదాలో ఆమె తన నాలుగో బడ్జెట్ ను నేడు ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్ తో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల వస్తువులు చౌకగా లభ్యం కానున్నాయి. మరికొన్ని వస్తువులు ప్రియం కానున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా, కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. ఈ బడ్జెట్ ద్వారా ధరలు తగ్గేవి, పెరిగేవి ఏమిటంటే…
ఇవి చౌకగా లభిస్తాయి..
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ చార్జర్లు, మొబైల్ ఫోన్ చార్జింగ్ ట్రాన్స్ ఫార్మర్లు, వజ్రాలు (కట్ అండ్ పాలిష్డ్), రత్నాలు, పలు రకాల అనుకరణ ఆభరణాలు (ఇమిటేషన్ జ్యుయెలరీ), పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగించే కెమికల్స్, మిథనాలు, మరికొన్ని రసాయనాలు, కెమెరా లెన్సులు, స్టీల్ స్క్రాప్, వ్యవసాయ పరికరాలు, దుస్తులు,పాదరక్షలు, విదేశీ యంత్ర సామగ్రి, తోలు వస్తువులు
ధరలు పెరిగేవి…
అనేక రకాల దిగుమతి వస్తువులు, విదేశీ గొడుగులు, క్రిప్టో లావాదేవీలు