Saturday, November 23, 2024

యూపీలో పొత్తుల్లేవ్.. మయావతిది ఒంటరి పోరాటం!

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ ప్రదేశ్‌ కు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలు సిద్దమవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీ,కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ తదితల పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలని అనేదానిపై చర్చలు కూడా మొదలైయ్యాయి. అయితే ఈ విషయంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు కోసం బీఎస్పీ చర్చలు జరుపుతోందన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఎంఐఎం, ఎస్​బీఎస్​పీ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(ఎస్‌బీఎస్పీ), హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో కలిసి ‘భాగీదారీ సంకల్ప్‌ మోర్చా’ పేరిట మాయావతి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీతో పలు దఫాలు చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మాయావతి నుంచి తాజా ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

దళిత ఓటర్లలో మంచి పట్టున్న బీఎస్పీకి రానున్న ఎన్నికలు చాలా కీలకం. ఒకప్పుడు యూపీలో అధికారంలో ఉన్న బీఎస్పీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఓటమి పలకరించడంతో సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారు. దీంతో పార్టీకి పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న మయావతి.. ఎన్నికల్లో ఒంటిగా బరిలో దిగాలని నిర్ణయించారు. పంజాబ్‌ మినహా వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరాఖండ్‌లోనూ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు మాయావతి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న మయావతి.. ఈసారి ఒంటరిగా విజయం సాధిస్తుందా? లేదా ? అన్నది చూడాలి.

వచ్చే ఏడాది కూడా జరగనున్న పంజాబ్ ఎన్నికలకు శిరోమణి అకాలీదళ్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. మొత్తం 117 మంది సభ్యుల అసెంబ్లీలో రెండు పార్టీలు సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా ఖరారు చేశాయి. శిరోమణి అకాలీదళ్ 97 స్థానాల్లో బీఎస్పీ 20 స్థానాల్లో పోటీ చేస్తుంది.

- Advertisement -

ఇది కూడా చదవండి: కేసీఆర్ ను గద్దె దించుతాం: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి..

Advertisement

తాజా వార్తలు

Advertisement