తాను సీఎం లేదా ప్రధాని కావాలని కలలు కంటున్నానన తెలిపారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నానని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీ వదంతులను వ్యాప్తి చేస్తోందని మాయావతి మండిపడ్డారు.రాష్ట్రపతిని కావాలని అనుకోను. యూపీలో బీజేపీ విజయానికి సమాజ్ వాదీ పార్టీయే కారణం. యూపీ సీఎం పదవికి తమ మార్గం సుస్పష్టంగా ఉండేలా ఎస్పీ నన్ను దేశానికి రాష్ట్రపతిని చేయాలని కలలు కంటోంది ’’ అని మాయావతి అన్నారు. నేను నా జీవితాన్నిసౌకర్యవంతంగా గడపలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ చూపిన మార్గంలో నడిచాను. అణగారిన వర్గాలు వారి కాళ్లపై వాళ్లు నిలబడటానికి కృషి చేశాను. అయితే ఇలాంటి పనులు రాష్ట్రపతి పదవిని అధిరోహించడం ద్వారా సాధ్యం కాదని, యూపీ సీఎం అవ్వడం ద్వారా లేకపోతే దేశ ప్రధానిగా ఎదగడం ద్వారానే జరుగుతుందని అందరికీ తెలుసన్నారు. మాయావతి రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారని, అందుకే ఆమె ఓట్లు బీజేపీకి వెళ్లాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల కామెంట్స్ చేశారు. ‘‘ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ మాయావతిని రాష్ట్రపతిని చేస్తుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ ఉందన్నారు అఖిలేష్.
Advertisement
తాజా వార్తలు
Advertisement