పాకిస్థాన్ నుంచి భారత్ లోకి వచ్చిన డ్రోన్ ని సరిహద్దు భద్రతాదళం ఆదివారం కూల్చివేసింది. పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద కనిపించిన డ్రోన్‌ను కాల్చినట్లు బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలోని షాజాదా గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.11 గంటలకు డ్రోన్ ను కూల్చివేసినట్టు ప్రకటించింది. అనంతరం బీఎస్ఎఫ్ దళాలు పాక్షికంగా దెబ్బతిన్న స్థితిలో, షాజాదా గ్రామం సమీపంలోని ధుస్సీ బంద్ సమీపంలో పడి ఉన్న నల్ల రంగు డ్రోన్ డీజేఐ మ్యాట్రిస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది చైనాలో తయారైంది. అనంతరం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులకు, సంబంధిత సంస్థలకు సమాచారం అందించారు..ఈ మేరకు వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement