Friday, November 22, 2024

ఓ కాల్ గర్ల్​ ఇష్టారాజ్యం..  దేశ సరిహద్దులు ఈజీగా దాటుతూ,  బంగ్లా నుంచి భారత్​లోకి

బంగ్లాదేశ్​, భారత్​లో అక్రమ చొరబాట్ల నేపథ్యంలో బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ నిఘా తీవ్రం చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్​ నుంచి ఇండియాకి అక్రమంగా వస్తున్న ఓ మహిళను పట్టుకున్నారు. బంగ్లాదేశ్​ బరిసాల్​ జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ పలుమార్లు అక్రమంగా దేశ సరిహద్దులు దాటుతున్నట్టు గుర్తించారు. కాగా, ఆమె బంగ్లదేశ్​లో కాల్​గర్ల్​ (వ్యభిచారం) అని తెలుస్తోంది. జవాన్ల ప్రాథమిక విచారణలో 2006లో ఎండీ ఇస్లాం అనే వ్యక్తిని పెళ్లాడినట్టు వెల్లడైంది. 2011లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె, ఇంటి సమస్యల కారణంగా 2013లో భర్తకు విడాకులిచ్చింది.  

2017లో  చట్టవిరుద్ధంగా భారత్​లోకి అడుగుపెట్టింది. డామన్​లోని తీన్​బట్టీకి చేరుకుని జీవనం కోసం బట్టలు కుట్టడం ప్రారంభించింది. అద్దె ఇంట్లో ఉండేదని మరింత డబ్బులు సంపాదించడానికి ఈజీ మార్గంగా వ్యభిచారం మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.  ఆ తర్వాత డామన్​లోని పలు ఏరియాల్లో కాల్​ గర్ల్​గా పనిచేసిందని తెలుస్తోంది. అంతేకాకుండా చాలాసార్లు బంగ్లాదేశ్​కు వెళ్లొచ్చిందని, ఆరు నెలల క్రితం మరోసారి బంగ్లేదేశ్​కు వెళ్లివచ్చినట్టు విచారణలో వెల్లడించింది. ఇట్లా బోర్డర్​ దాటించడానికి కొంతమందికి దాదాపు 19వేలు చెల్లించినట్టు పేర్కొంది.  జనవరి 31న మరోసారి బంగ్లాదేశ్​ నుంచి ఇండియాలోకి టౌట్​ సహాయంతో వస్తుండగా బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ దళాలు పట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement