Tuesday, November 19, 2024

BRS Party – పేర్లు ప్ర‌క‌టించ‌ని ఆ నాలుగు స్థానాల‌లో ఎవ‌రంటే …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో పోటీకి దింపే భారాస అభ్యర్థుల తుది జాబితా ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన నాలుగు స్థానాల అభ్యర్థిత్వాలను ప్రకటించేందుకు భారాస చీఫ్‌ కేసీఆర్‌ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాల అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పార్టీలో కొనసా గుతున్న ఉత్కంఠకు తెరదించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. జనగామ, నర్సాపూర్‌, గోషామ హల్‌, నాం పల్లిలో పోటీకి పెట్టే అభ్యర్థులపై గత ఐదు రోజు లుగా తనదైన శైలిలో జరుపుతున్న కసరత్తు సోమ, మంగళవారాల్లో పూర్తవుతుందని శుక్ర, శనివారా ల్లో అధికారికంగా అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చన్న సం కేతాలను భారాస అగ్రనేత లు నియోజకవర్గ నేతలకు పంపిస్తున్నట్టు సమాచా రం. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం నర్సాపూర్‌లో సునీతా లక్ష్మా రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్లు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. వచ్చే వారం ఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్థులతో సీఎం కేసీఆర్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహ ంచి ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నట్టు చెబుతున్నారు.

పెల్లుబికుతున్న విభేదాలు
అభ్యర్థుల ప్రకటనకు ముందే జనగామ నియోజకవర్గం లోని పార్టీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెండు వర్గాలుగా విడిపోవడంతో నియోజకవర్గ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. జనగాంలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉప సంహరించుకుని పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు బహరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పల్లా వ్యాఖ్య లను భారాస అధినాయకత్వం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఈ తరహా ప్రకటనలు పార్టీకి నష్టం కలిగిస్తాయని కొందరు సీనియర్లు అభిప్రాయ పడుతున్నట్టు చెబుతున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటనకు మూడు రోజుల ముందు పల్లాకు మద్దతుగా జనగాంకు చెందిన భారాస ప్రజా ప్రతినిధులు పలువురు #హదరాబాద్‌లో రహస్యంగా సమా వేశమై ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయా లని నిర్ణయించారు. యాదగిరి రెడ్డికి పార్టీ టికెట్‌ ఇస్తే తాము ఎన్నికల్లో స#హకరించమని సంకేతాలు పంపారు. ఈ భేటీ జరిగిన మరుసటి రోజు ఇక్కడి నాచారంలోని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన ఫంక్షన్‌ హాల్‌లో ఆయన మద్దతు దారులు సమావేశమయ్యారు. ఇలా పల్లా, ముత్తిరెడ్డి వర్గాలు జనగాం నియోజక వర్గంలో రోజూ పోటాపోటీ కార్య క్రమాలు కొనసాగుతున్నాయి. కాగా ఇరువురు నేతల మధ్య విబేధాలు భగ్గుమనడ ంతో భారాస అధిష్ఠానం ఆచితూచి వ్యవ హరి స్తోంది. జనగామ టికె ట్‌పై ఆశలు పెట్టుకుని కొంతకాలంగా అక్కడ పలు కార్యక్రమాలు నిర్వ హస్తున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

నాలుగు స్థానాల ప్రకటన తర్వాతే విస్తృత సమావేశం
పెండింగ్‌లో నాలుగు అసెంబ్లి నియోజక వర్గాలకు సంబందించిన అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలంగాణ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ప్రచార వ్యూహం, విపక్ష పార్టీల అభ్యర్థులను చిత్తు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూ హంపై కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా నాంపల్లిలో బీఆర్‌ఎస్‌ సీరియస్‌ పోటీలో లేకపోయినా.. ఎందుకు ప్రకటించలేదనే విషయం పార్టీ వర్గాల్లో కొంత అయోమయానికి గురి చేస్తున్నట్టు సమా చారం గోషామ హల్‌, నాంపల్లి టికెట్‌పై ఎంఐఎం అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే నాంపల్లి టికెట్‌ మళ్లి తనకే దక్కుతుందని గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆనంద్‌గౌడ్‌ ధీమాతో ఉన్నారు.

మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావును కొనసాగేనా?
మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో బయట కలకలం రేపుతున్నాయి. కేటీఆర్‌, కవిత తదితరులు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు. మైనంపల్లి టికెట్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ పునరాలోచనలో పడ్డట్టు ప్రచారం సాగుతుండగా.. ఆయన అనుచరులతో సమావేశాలు నిర్వహస్తున్నారు. మైనంపల్లి హన్మంతరావును మార్చాల్సి వస్తే.. ఆ టికెట్‌ కోసం మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే నేటి ఉదయం మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తో భేటి అయ్యారు..స్థానిక రాజకీయాలపై ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement