వారానికోసారి సర్వే నివేదికలు
ఆరు నెలలుగా నిర్వహణ
మంత్రులందరికీ తిరిగి ఛాన్స్
కాంగ్రెస్, తెదేపా జంపింగ్‌లకూ మళ్లీ అవకాశం
టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ ఉమ్మడి వరంగల్‌లో ఐదుగురు సిట్టింగులకు హుళక్కి
స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్యకు వరంగల్ లోకసేభ
ఎంపీ పసునూరికి ఎమ్మెల్సీ .. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి…
ఎంపీగా ఐటీ కమిషనర్ జీవన్‌లాల్
ముత్తిరెడ్డిని మారిస్తే పోచంపల్లి ఇన్
డోర్నకల్ బరిలో ఎంపీ కవిత
ఆషాఢం తర్వాతే తొలి జాబితా
సంకేతాలిస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: మరో నాలుగు మాసాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ-కి పెట్టే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతం చేశారు. ఆషాఢ మాసం ముగిసిన మర్నాడే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలన్న ప్రణాళికతో ఉన్న కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దాదాపు 80 సెగ్మెంట్‌ల అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గత ఆరు నెలలుగా వారానికొకసారి అన్ని నియోజక వర్గాల్లో నిర్వహించిన సర్వేలు నిఘావర్గాల ద్వారా తెప్పించిన సమాచారం నివేదికలను క్రోడీకరించి ఎన్నికల బరిలో ఎవరిని నిలబెట్టాలన్న అంశానికి సంబంధించి తుది నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రెండు నియోజకవర్గాలు జనగాం, పరకాల మినహా మిగతా 10 నియోజక వర్గాలలో ఎన్నికల బరిలోకి దింపే అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు- సమాచారం. సిట్టింగ్‌లలో స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలను మార్చి ఆ నియోజకవర్గాల్లో సీనియర్లను ఎంపిక చేసినట్టు- తెలుస్తోంది. ఈ నియోజకవర్గ సిట్టింగులు డాక్టర్ తాటికొండ రాజయ్యను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థిగా పోటీ-కి పెట్టాలన్న నిర్ణయం జరిగిందని చెబుతున్నారు.
రాజయ్య స్థానంలో కడియం శ్రీహరిని పోటీ-కి పెట్టనున్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌కు కట్టబెట్టనున్నారు. మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ స్థానంలో మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను నిలబెట్టి ఆమె ఎమ్మెల్సీ స్థానాన్ని శంకర్ నాయక్‌కు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. డోర్నకల్ అసెంబ్లీకి మహబూబాబాద్ లోక్‌సభ సభ్యురాలు మాలోత్ కవితను ఎంపిక చేసిన కేసీఆర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కవిత తండ్రి రెడ్యా నాయక్‌ను తప్పించాలని ప్రతిపాదించారు.
ఆయనకు వచ్చే ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవి ఇచ్చే ఆలోచనతో గులాబీ దళపతి కేసీఆర్ ఉన్నట్టు- సమాచారం. పాలకుర్తి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిరిగి పోటీ- చేయనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అభ్యర్థ్విత్వాలను ఖరారు చేసినట్టు- ప్రచారం జరుగుతోంది.
భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డిలను తిరిగి పోటీ-కి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్టు- తెలుస్తోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరైన ఆరూరి రమేష్‌ను మరోసారి వర్ధన్నపేట నుంచి పోటీ- చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో జిల్లా పరిషత్ ఇన్‌చార్జ్ చైర్మన్ బడే నాగజ్యోతిని పోటీ-కి నిలపాలన్న ప్రతిపాదనకు వచ్చినట్టు- సమాచారం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీత) గత ఎన్నికల్లో పోటీ- చేసి విజయం సాధించారు. భారాస నుంచి పోటీ-కి పెట్టాలని భావిస్తున్న నాగజ్యోతి మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఆమెను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి పెట్టి సత్తా చాటాలని భావిస్తున్నట్టు- ప్రచారం జరుగుతోంది.
కాగా తరచూ వివాదాల్లో తలదూర్చి ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్న జనగాం ఎమ్మెల్యే పనితీరు ఆశాజనకంగా లేదని, సర్వే నివేదికలు కూడా ప్రతికూలంగా రావడంతో ఆయనను మార్చాలా లేదా అన్న అంశంపై చర్చించి తుది నిర్ణయానికి రావాలని భారాస చీఫ్ కేసీఆర్ వచ్చినట్టు- సమాచారం.
తాజాగా మరో రెండుసార్లు సర్వే చేయించి ఆ తర్వాత ముత్తిరెడ్డి విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు- సమాచారం. అప్పటికీ సర్వే ఫలితాలు మెరుగ్గా లేకపోతే ఆయనను మార్చి కొత్తవారిని ఎంపిక చేసే అవకా శం ఉన్నట్టు- సమాచారం. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థ్విత్వాన్ని పరిశీలిస్తున్నట్టు- తెలుస్తోంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించి సర్వేలలో వచ్చిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మళ్ళీ క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి నివేదిక అందజేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు- తెలుస్తోంది. ఈ రెండు నియోజక వర్గాలకు సంబంధించి తాజా సర్వే
ఫలితాలు వచ్చాకే వీరిని మార్చి కొత్తవారికి పోటీ- చేసే అవకాశం ఇవ్వాలా లేదా అన్నది ఖరారవుతుందని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
లోక్‌సభ బరిలో ఐటీ- కమిషనర్ జీవన్ లాల్
మహబూబాబాద్ ఎంపీగా ఉన్న కవితను అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి రెడ్యా నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోర్నకల్ నుంచి పోటీ-కి పెట్టాలని భావిస్తున్న తరుణంలో ఎంపీగా ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్‌ను బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు- సమాచారం. విధినిర్వహణలో పేరు ప్రఖ్యాతులున్న జీవన్ లాల్‌ను ఎంపీగా పోటీ- చేయించి జాతీయ స్థాయిలో ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు- విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడుదేశంలో 36 కోట్ల బంజారాలు ఉన్నారని ఈ సామాజిక వర్గంతో జీవన్ లాల్ కు బలమైన పరిచయాలు ఉన్నాయని, భవిష్యత్‌లో పార్టీకి ఆయన సేవలు ఉపయేగ పడే అవకాశం ఉండటంతో ఆయన పేరు పరిశీలి స్తున్నట్లు-
సమాచారం జీవన్ లాల్ తండ్రి లావుడ్యా రాములు నాయక్ ప్రస్తుతం వైరా ఎమ్మెల్యే గా ఉన్నారు. సర్వే లలో వచ్చిన ఫలితాల ప్రకారం ఆయనకు మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉండటంతో …ఆయనను పోటీ- నుండి తప్పించి బంజారా జాతిలో బలమైన నాయకుడుగా ముద్రపడిన జీవన్ లాల్‌ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు- ప్రచారం జరుగుతోంది. ఈ దఫా లోక్ సభకు …అందకు చదువుకున్న వారిని హిందీ, ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యత ఉన్న విద్యావేత్తలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి బలమైన నిర్ణయం తీసుకున్నట్లు- తెలుస్తోంది.
భాగ్యనగరంలో..
రాజధాని హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో భారాస పోటీ- నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంటు-ందని ఆ వర్గాలు పేర్కొంటు-న్నాయి. సిట్టింగ్ స్థానాలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట మొత్తం కలిపి సుమారు 20కి పైగా కొత్త ముఖాలను శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దించాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని, ఇందుకు సంబందించిన తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారని ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్, తెదేపాల నుంచి వచ్చినవారికి మళ్లీ అవకాశం
కాంగ్రెస్, టీ-డీపీల నుంచి భారాసలో చేరిన ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ వచ్చే ఎన్నికల్లో పోటీ- చేసే అవకాశం ఇవ్వనున్నట్టు- సమాచారం. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12, టీ-డీపీ నుంచి ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు భారాస తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై తీవ్రమైన ఆరోపణలతో పాటు-… అటు- ప్రజలు, ఇటు- పార్టీ కార్యకర్తల్లోనూ వ్యతిరేకత ఉన్నట్లు- సర్వేల్లో బయటపడినందున వారికి ఈ ఎన్నికల్లో పోటీ- చేసేందుకు అవకాశం ఉంటు-ందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ విషయంలో పార్టీ చీఫ్ కేసీఆర్ వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నట్లు- సమాచారం. ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇచ్చిన హామీ మేరకు మళ్లీ టికెట్ ఇచ్చి ప్రత్యేక వ్యూహంతో గెలవాలా.. లేక వారికి ఎమ్మెల్సీ వంటి హామీ ఇచ్చి కొత్తవారిని కదన రంగంలోకి దించాలా అనే విషయంలో కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ఆయా పార్టీల నుంచి వచ్చి భారాసలో చేరిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి పోటీ-కి అవకాశం ఇవ్వకపోతే వారు పార్టీని వీడి విపక్ష పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటు-న్నారని ఉప్పందడంతో వారికి నచ్చజెప్పే ప్రక్రియ కు శ్రీకారం చుట్టారని, ఈ పనిని ఇద్దరు కీలక నేతలకు అప్పగించినట్టు- ప్రచారం జరుగుతోంది.
మంత్రులందరికీ పోటీ-కి ఛాన్స్
కేసీఆర్ మంత్రి వర్గంలో కొనసాగుతున్న వారందరికీ ఈ దఫా పోటీ-కి అవకాశం ఉంటు-ందని చెబుతున్నారు. కేబినెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 17 మంది ఉన్నారు. వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీలుగా కాగా… మిగతా వారందరూ ఎమ్మెల్యేలే. 14 మంది మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ సంతృప్తిగానే ఉన్నారు. అయితే… తీవ్రమైన ఆర్థిక నేరాభియోగాలు ఎదుర్కొంటు-న్న ఓ మంత్రికి సంబంధించిన కేసులో… ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇటీ-వల ఆదేశించింది. ఒకవేళ ఆ కేసులో ఎన్నికల్లోపే ప్రతికూల తీర్పు వస్తే టికెట్‌పై ప్రభావం చూపవచ్చునని ప్రచారం జరుగుతోంది.
ఆషాడం ముగిశాకే..
అసెంబ్లీ ఎన్నికలకు వేగంగా సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ జులై 17న ఆషాడ మాసం ముగిసిన తర్వాత.. మంచి ముహూర్తాన తొలి జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు- పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్వేలు, వివిధ అంశాలపై సమాచార సేకరణ ద్వారా.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వస్తున్నట్లు- సమాచారం. 2018 ముందస్తు ఎన్నికలప్పుడు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్… ఇప్పుడూ అదే ఆలోచనతో ఉన్నట్లు- తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ- ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు- అనేక మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గాల్లో పోటాపోటీ- కార్యక్రమాలు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికలకు త్వరిత గతిన అభ్యర్థులను ప్రకటించడమే మంచిదని గులాబీ నాయకత్వం భావిస్తున్నట్లు- తెలుస్తోంది.