Friday, November 22, 2024

BRS Leaders Tension – అన్నా లిస్ట్ లో నా పేరు ఉందా…..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ విద్యుత్‌ అంశంతో గులాబీకి అనూహ్య ఊపునిచ్చింది. విమర్శల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ అస్త్రాలు విసురుతు న్నారు. వీటన్నింటి ద్వారా భారాస గ్రాఫ్‌్‌ ఊహించని విధంగా పెరిగిందన్న చర్చ సాగుతోంది. ఇలాంటి తరుణంలో టికెట్‌ దక్కితే చాలు.. సీఎం కేసీఆర్‌ బొమ్మ పెట్టుకొని సునాయసంగా గెలిచే అవకాశం ఉందని భారాస లీడర్లు భావిస్తున్నారు. ఆయా స్థానాల్లో సిట్టింగ్‌, ఆశావహులు తెగ ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు భారాస ఫస్ట్‌ లిస్ట్‌ వస్తుందన్న ఊహాగానాలు సాగాయి. 80 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించబోతున్న ట్లుగా చర్చ నడిచింది. ఎప్పుడు ఫస్ట్‌ లిస్ట్‌ విడుదల అయినా అందులో తమ పేరు ఉండేలా సిట్టింగ్‌లు ముమ్మరంగా అధిష్టానం పెద్దలను, అగ్రనేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

టైం ఉంది.. తొందరొద్దు
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లి ఎన్నికలు నవంబర్‌ లేదా డిసెంబర్‌ మొదటి వారంలోపు జరిగే అవకాశాలున్నాయి. సెప్టెంబర్‌లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. జులై నెల ఎలాగా మంచి రోజులు లేవు. ఆగస్టు 18 వరకు భారాసలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోబోరని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో అభ్యర్థులకు సంబంధించి లిస్ట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. అప్పటి వరకు కొన్ని స్థానాల్లో పరిస్థితులు మారనున్నాయి. ముందుగా ప్రకటించి ఇబ్బందులను తెచ్చుకోవడం తప్పితే పెద్దగా పార్టీకి ఉపయోగం కూడా లేదన్న అభిప్రాయంలో భారాస బాస్‌ ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో సమానంగా ఉండి, టికెట్‌ ఆశిస్తున్న మరో ఇద్దరు లేదా ముగ్గురు నేతలు ఉన్నారు. ఒక వేళ టికెట్‌ ఇప్పుడే ప్రకటిస్తే ఆయా స్థానాల్లో మెజార్టీ తగ్గుతుందని భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే ముందు ప్రకటిస్తే బాగుంటుందని గులాబీ అధినేత పలువురితో చర్చించినట్లుగా సమాచారం.

సీరియస్‌గా నజర్
ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లి ఎన్నికలు మూడోవి. 2014 ఎన్నికల్లో అభ్యర్థులను వివిధ కోణాల్లో చూసి
ఎంపిక చేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఉద్యమ పరిస్థితుల ప్రభావంతో పలువురు ఉద్యమకారులకు టికెట్లు దక్కాయి. అనంతరం తెలంగాణలో మారుతున్న రాజకీయాలతో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి కారెక్కారు. అప్పుడు ఉన్న సిట్టింగ్‌లందరికి మళ్లిd 2018 ఎన్నికల్లో టికెట్లను కేటాయించారు. అసెంబ్లి రద్దు చేసిన వెనువెంటనే మొదటి జాబితాలోనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 14 స్థానాలకు తర్వాత ప్రకటించారు. మూడో సారి ఎంత మంది అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదే కాదు.. సిట్టిం గ్‌లు తమ తమ స్థానాలను పదిలం చేసుకునేలా అధిష్టానంతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఆశావహులు అగ్రనేతలను నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. ఫస్ట్‌ లిస్ట్‌లోనే తమ పేరు, అసెంబ్లిd స్థానం ఉండేలా అధిష్టానం పెద్దల వద్ద మనోవేదనను పంచుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో సిట్టింగ్‌లకే అవకాశాలు ఇవ్వడంతో ఆశావహులు పెద్దగా నోరు మెదప లేదు. ఇప్పటికే పదేళ్లు రాజకీయంగా వెనకబడిపోయాము, వయోభారం వెంటాడుతుందన్న బెంగతో కొంత మంది బహిరంగంగానే ప్రకటిస్తూ వస్తున్నారు. అధిష్టానం ఇచ్చినా ఇవ్వకున్నా పోటీ చేసి తీరుతామంటూ కొన్ని సెమ్మెంట్‌లలో కామెంట్లు చేస్తున్నారు. పార్టీ లైన్‌లో పని చేసుకుంటూనే టికెట్‌ ఫైట్‌ సాగిస్తున్నారు.

ఆ స్థానాల్లో మార్చడం పక్కా..

మొదటి, రెండవ ఎన్నికలకు భిన్నంగా మూడో సారి అసెంబ్లి ఎన్నికలు తెలంగాణలో జరగనున్నాయి. గతంలో భారాసకు పోటీ నిచ్చేలా కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఉంటూ వచ్చింది. బీజేపీ రెండు ఎన్నికల్లోనూ ప్రభావం చూపిం చకపోవడమేకాకుండా డిపాజిట్లను కోల్పోయింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీజేపీ నుంచి నలు గురు ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్‌ కర్నాటక ఊపుతో రాష్ట్రంలో గెలవాలన్న కసితో ఉంది. ఇవన్నీ పరిగణ లోకి తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల ఎంపిక ప్రతిపక్షాలకే కాదు.. సొంత పార్టీ నేతలకు సైతం ఊహ కందని విధంగా ఉండబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జన ంలో పార్టీపై వ్యతిరేకత లేదు.. కానీ సిట్టింగ్‌పై వ్యతిరేకత కొన్ని స్థానాల్లో ఉన్నట్లు సర్వే రిపోర్టులు స్పష్టం చేశాయి. ఆయా రిపోర్టులను పరిగణలోకి తీసుకోబోతున్నారు. అవసరమైతే ఎంత బలమైన సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినా తప్పించేందుకు వెనకాడేది లేదు అన్న విధంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఓడిపోయే పరిస్థితుల్లో మంత్రి ఉన్నా మార్చాల్సిందే అన్న అభిప్రాయంతో అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. లిస్ట్‌ ఫైనల్‌ దశలో ఉంది. ఇప్పటి వరకు మంత్రి కేటీఆర్‌ టికెట్‌ కన్ఫామ్‌ సంకేతాలను ఇచ్చిన ఓ 20 స్థానాల వరకు మార్చే అవకాశం లేనే లేదు. హుజూరాబాద్‌ విషయంలో మాత్రం అధిష్టానం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. పార్టీ అవకాశం ఇస్తే గెలుపు సులువుగా మార్చుకునే నేత అయితే బాగుండేది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధినేత సైతం ఇప్పటికే ఇందుకు సంబంధించి కొందరితో చర్చించినట్లుగా సమాచారం. జాతీయ పార్టీగా నిలదొక్కుకునే దశలో సొంత రాష్ట్రంలో చతికిల పడొద్దన్న కఠిన నిర్ణయంతో భారాస అధినేత సీఎం కేసీఆర్‌ 2023 అసెంబ్లిd ఎన్నికలను సీరియస్‌గా తీసుకొని ముందుకు వెలుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement