హైదరాబాద్ – , ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లి అభ్యర్థుల ఎంపిక కీలక దశకు చేరుకున్న వేళ ఈ ఎన్నికల్లో భారాస మరోసారి అత్యధిక అసెంబ్లి స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగు రవేయబోతోందని సర్వే నివేదికలు స్పష్టం చేసినట్టు సమాచారం. తాజా సర్వే నివేదికను శనివారం రాత్రి అందుకున్న కేసీఆర్ అందులో ఉన్న వివరాల ప్రకారమే భారాస అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేసి అసెంబ్లి బరిలో నిలిపే వారి పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. రెండు ప్రైవేట్ సంస్థలు, నిఘా విభాగం మొత్తం మూడు విభిన్న రకాల సర్వేలను చేయించిన కేసీఆర్ ఆ ఫలితాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్టు చెబుతున్నారు. సర్వేలలో వచ్చిన నివేదికల ప్రకారం కారు జోరు ఈ ఎన్నికల్లోనూ కొనసాగ నున్నదని, మళ్ళీ గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని తెలుస్తోంది. తొలిసారిగా ప్రతి నియోజక వర్గంలో వేల సంఖ్యలో సర్వే శాంపిల్స్ సేకరించారని, ఇంతటి సర్వే మునుపెన్నడూ ఏ రాజకీయ పార్టీ చేయించి ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది. నియోకవర్గాల్లో ఖచ్చితమైన సమాచారం రావాలన్న ఉద్దేశ్యంతోనే వేల సంఖ్యలో శాంపిల్స్ ను తీసుకున్నట్టు సమాచారం.
జీ హచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లి నియోజక వర్గాల్లో ఉన్న సెటిలర్లు, ఇతర రాష్ట్రాల ఓటర్లు గులాబీ జెండా కే జైకొట్టి కారు గుర్తుకు ఓటెయ్యాలన్న నిర్ణయానికి వచ్చారని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఓటర్లు సైతం ఈ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇవ్వ డానికి సిద్ధమయ్యారన్న విషయం సర్వే నివేదికల్లో బయట పడిందని చెబుతున్నారు.
గ్రేటర్ హదరాబాద్తో సహా అన్ని నియోజకవర్గాల్లో యువత, మ హళలు, విద్యావేత్తలు, సామా జిక కార్యకర్తలు ఇలా ప్రతి వర్గం భారాసకు బాసటగా నిలవాలన్న నిర్ణయంతో ఉంది. ముఖ్యంగా యువతీయువకులు యూత్ ఐకాన్ కేటీఆర్కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందుకు కారణం ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలతో హదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టి విశ్వనగరంగా తీర్చిదిద్దడ మేనని అంటున్నారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా 74 స్థానాల్లో విజయం ఖాయమని సర్వే నివేది కలు స్పష్టం చేస్తుండగా మరో 12చోట్ల కష్టపడితే వాటిని భారాస ఖాతాలో వేసుకోవచ్చన్న నివేదిక లున్నాయని సమాచారం. మరో 10 స్థానాల్లో అభ్యర్థులను మారిస్తే అందులోనూ పాగా వేయవచ్చన్న సర్వే నివేదికలను గమనంలోకి తీసుకుని గెలుపు గుర్రాలు(అభ్యర్థుల)ను మారుస్తున్నట్టు సమాచారం. తాజా సర్వే నివేదికల ప్రకారమే అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసి ప్రకటిస్తారని భావిస్తున్నారు. తాజా సర్వే నివేదికలతో భారాస చీఫ్ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెట్టి విపక్ష పార్టీలను మట్టికరిపించే ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.