Saturday, November 23, 2024

KCR Strategy – వేగంగా పావులు కదుపుతున్న బిఆర్ఎస్ … ఆప‌రేష‌న్ హ‌స్తం …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రతిపక్షాల్లోని అసంతృప్తుల చూపు భారాస వైపు మళ్లుతోంది. కాంగ్రెస్‌, బీజేపీల్లోని పలువురు నేతలు త్వరలో కారెక్కనున్నారు. గులాబీ కండువా కప్పుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రెండో దశ చర్చలు సైతం ముగిశాయి. సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. టికెట్‌ల అంశం, హామీలు ఖరారు అయ్యాయి. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని గులాబీ గూటికి చేరనున్నారు. అధినేత సీఎం కేసీఆర్‌ సమ క్షంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఆయా నేతలు తమ స్థానిక క్యాడర్‌తో మనసులోని వేదనను పంచుకోనున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ మారేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేయనున్నారు. తమకు జరుగు తున్న అన్యాయాన్ని పార్టీ కార్యకర్తల వద్ద మనస్సులోని గాయాలను విప్పనున్నారు. వారిని సైతం తమతో కలిసి కారెక్కేందుకు ప్రయత్నించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

కారెక్కనున్న కాంగ్రెస్‌ అగ్రనేత
కాంగ్రెస్‌ బలంగాఉన్న జిల్లాల్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం ప్రధానంగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఊపు కనిపిస్తోంది. మొదటి నుంచి క్యాడర్‌ ఉండటం ఆ పార్టీకి కలిసి వస్తోంది. ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండలో మొత్తం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందరూ ఉన్నా హస్తం నుంచి ఇద్దరు ఎంపీలు అయ్యారు. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్‌ స్ట్రెంగ్త్‌, సిట్టింగ్‌ల మీద వచ్చే వ్యతిరేకత పార్టీకి మైనస్‌గా మారుతుందని భావిస్తున్న భారాస అధినేత వచ్చే ఎన్నికల్లో క్లీన్‌ స్వీపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అందుకోసం హస్తంలోని అసంతృప్తులకు భారాస గాలం వేస్తోంది. కాంగ్రెస్‌లో అగ్రనేతగా ఉన్నా తమను టార్గెట్‌ చేసి సొంత పార్టీ నేతలే మాట్లాడు తుండటాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతు న్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీరుతోనే తమకు ఇబ్బంది తప్ప మిగతాది ఎలాంటి కష్టం లేదని చెప్పుకుంటున్నారు. తమకు కాంగ్రెస్‌ అన్ని అవకాశాలు ఇచ్చిం దని, ప్రస్తుతం పార్టీలో ఉండనీయకుండా, పొమ్మన లేక పొగ పెడుతున్నారని మనో వేదనను గులాబీ అగ్రనేతల వద్ద వాపోతు న్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ సమ క్షంలో భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి గులాబీ గూటికి చేరారు. ఎమ్మెల్సీ హామీ దక్కడంతోనే కారెక్కా రన్న చర్చ సాగుతోం ది. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్‌లోని మరో అగ్ర నేత సతీసమేతంగా బీఆర్‌ఎస్‌ లో చేరే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్యే టికెట్‌, ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చేందుకు నిర్ణయించినట్లుగా సమాచారం. పెద్ద సభను ఏర్పాటు చేసి అనుచరులతో చేరనున్నట్లు అధినేత కేసీఆర్‌కు తెలిపారు. జిల్లాల్లో ఉన్న సెకండ్‌ క్యాడర్‌ను సైతం గులాబీలో చేర్చుకునే ప్రయ త్నాలు సాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఎన్నికల ముందు కొందరిని చేర్చుకునే అవకాశం ఉంది.

ఒకరికి ఓకే.. ఇంకొకరు వద్దు
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు సిద్ధమైనట్లుగా గులాబీ వర్గాలు తెలుపు తున్నాయి. ఒకరు కమలం నుంచి కాగా, మరొకరు హస్తం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు త్వరలో కారులో ప్రయాణం చేసే ప్రయత్నాలు సాగాయి. చేరికలు ఖరారు అయినా సొంత సామాజిక వర్గం నేతను పార్టీలో చేర్చుకునేందుకు పెద్దగా అధినేత కేసీఆర్‌ ఆసక్తి చూపించడం లేదన్న చర్చ నడుస్తోంది. జిల్లా కేంద్రంలోని నేతను మాత్రం చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ స్థానం నుంచి మళ్లిd అతనే పోటీ చేసేందుకు టికెట్‌ కన్ఫామ్‌ చేశారని సమాచారం. ఇక కమలం నేత మాత్రం ప్రస్తుత స్థానంలో మళ్లిd పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. గ్రేటర్‌ శివారు ప్రాంతం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలను అధిష్టానం చెవిలో వేయగా.. అధినేత కరాకండిగా వద్దంటున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజకీయ పరిస్థితులు మారితే తప్ప ఆ నేత ఇప్పట్లో కారెక్కే అవకాశాలు లేవు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సైతం కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై నజర్‌ నడుస్తోంది. త్వరలో అక్కడి నుంచి కూడా కొంత మంది నేతలు కారెక్కే ఛాన్స్‌ ఉంది. ఉమ్మడి ఆదిలా బాద్‌లో ఓ నేతతో సంప్రదింపులు జరుపుతున్నారు. చర్చలు కొలిక్కి వస్తే ఆయన కూడా గులాబీ చెంతకు చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement