బీఆర్ఎస్ పార్టీ తొలి సభను ఈనెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున ఈ సభను నిర్వహించాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ బీఆర్‌ఎస్ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ సభకు హాజరుకానున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్‌ను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. సభను ముందుగా ఢిల్లీలో నిర్వహించాలని పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ భావించారు. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోనే సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement