హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారాస వ్యూ హం మార్చింది. ఎన్నికలపై స్పీడ్ పెంచుతోంది. ప్రత్యర్థు లకు చుక్కలు చూపించేలా ఎన్నికల ప్రచారాన్ని నిర్వ హంచబోతోంది. విపక్షాలకు ముచ్చెమటలు పట్టేలా యువనేతను రంగంలోకి దించబోతోంది. ఇప్పటికే టార్గెట్-100ను నిర్ణయించిన భారాస అధిష్టానం ఆ దిశగా ఎన్నికల క్షేత్రంలోకి అడుగు పెట్టబోతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల కన్నా ముందే అధికార పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయిం చింది. మొదట యువనేత, తర్వాత గులాబీ బాస్ రంగంలోకి దిగబోతున్నారు. మంత్రి కేటీఆర్ బస్సు యాత్రతో రాష్ట్రం అంతటా పర్యటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే బస్సు యాత్రను ముగించాలని నిర్ణయించారు. అనంతరం ఫైనల్ టచ్‌గా అధినేత కేసీఆర్ అస్త్రాలను సందించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 1 నుంచి భారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 110 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వ హంచ నున్నారు. 9 ఏళ్ల ప్రగతిని నేరుగా ప్రజలకు వివరిం చేలా పక్కా ప్లాన్‌తో ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతు న్నారు. యువనేత రాకతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా కార్యక్రమాలు నిర్వ#హంచనున్నారు. దాదాపు 100 కార్లతో యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోయే యాత్రకు ప్రతి నియోజక వర్గానికి సమన్వయ కర్తలను నియమించనున్నారు. యాత్ర విజయవంతం చేసే బాధ్యతలను వారికి అప్ప గించాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సుదీర్ఘ కసరత్తు నిర్వ హస్తున్నారు. జీ హచ్‌ఎంసీ ఎన్ని కల్లో మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహంచారు. అదే పద్ధతిలో రానున్న అసెంబ్లిd ఎన్నికల ప్రచారాన్ని కూడా చేపట్టాలని అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రోడ్ షోలు, సభలు యాత్రలో ఉండనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే యాత్రను ముగించేలా కార్యాచరణను సిద్ధం చేశారు. క్యాడర్‌లో జోష్ పెంచుతూ మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహంచనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తాము సాధించిన విజయాలు.. 9 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం భారాస చేయనుంది. బస్సు యాత్రలో మంత్రి కేటీఆర్ ద్వారా జనంలోకి ప్రగతి నివేదికను ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికి సంక్షేమ పథకం అందిందని చెప్పబోతున్నారు. రైతు బంధు, రైతు బీమా, హరితహారం, మిషన్ భగీరథ, కాళేశ్వరం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ప్రతిష్టాత్మక పథకాలను, హదరాబాద్ అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లనున్నారు. ఐటీలో #హదరాబాద్ ముందుందన్న విషయాన్ని గుర్తు చేయనున్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అనే విధంగా ప్రచారం సాగనుంది.
ప్రతిపక్షాలను తమ వైపు తిప్పుకునేలా భారాస వ్యూ#హం సిద్ధం చేసింది. మంత్రి కేటీఆర్ బస్సు యాత్రపై కాంగ్రెస్, బీజేపీ చూపును మళ్లించనున్నాయి. యాత్రపై విమర్శలు, కౌంటర్‌లు కొనసాగే అవకాశం ఉన్నట్లు గులాబీ అధిష్టానం భావిస్తోంది. యాత్ర సాగినన్ని రోజులు విపక్షాలపై విమర్శలు ఉండనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గులాబీ చక్రబంధంలో చిక్కుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రసంగాల దెబ్బలకు విపక్షాలు కొట్టుమిట్టాడేలా వ్యూ#హరచన సాగుతోంది.
బస్సు యాత్రకు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఏ నియోజకవర్గం నుంచి మొదలు పెట్టి.. ఏ నియోజకవర్గంలో ముగించాలని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని సభలు, రోడ్ షోలు నిర్వ#హంచాలో నిర్ణయిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలువురు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. పార్టీకి కష్టంగా ఉన్న స్థానాల్లో ఎక్కువ రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
100 కార్లతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణను చుట్టిరానున్నారు. బస్సు యాత్ర సాగే ప్రాంతాల్లో కార్ల సందడి నెలకొననుంది. పార్టీ గుర్తు కారు కావడంతో జనంలోకి బలంగా తీసుకెళ్లనున్నారు. అందులో భాగంగా కార్లు ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ అనుచరులు బస్సు యాత్రను ముందుండి నడిపించనున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు, #హవాను చూపించనున్నారు. మంత్రి కేటీఆర్‌తో స్థానిక ప్రజలు మాట్లాడేలా అవకాశం కల్పించనున్నారు.
యువనేత బస్సు యాత్ర ముగిసిన తర్వాత రంగంలోకి గులాబీ బాస్ దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి రానున్నారు. విపక్షాలపై అస్త్రాలను ప్రయోగించనున్నారు. తాము చేసిన అభివృద్ధితో పాటు విపక్షాల కుట్రలను జనం ముందు ఉంచేలా వ్యూహాలను సిద్ధం చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా భారాస విస్తరించాలనే బలమైన సంకల్పంతో ముందుకువెళ్తున్న సీఎం కేసీఆర్ అంతే పకడ్బందీగా తెలంగాణలో అడుగులను తయారు చేసుకుంటున్నారు. టార్గెట్-100ని సీరియస్‌గా తీసుకొని అమలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు సీఎం వ్యూహాలను అంచనా కూడా వేయలేని విధంగా వచ్చే అసెంబ్లిd ఎన్నికలు ఉండనున్నాయి.