Friday, November 22, 2024

మోడీకి సింగ‌రేణి సెగ – 8న కోల్ బెల్ట్ ఏరియాలో బిఆర్ఎస్ మ‌హాధ‌ర్నాలు..

హైద‌రాబాద్ : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ఈ నెల ఎనిమిదో తేదిన హైద‌రాబాద్ కు రానున్నారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంఖుస్థాప‌న‌లు, ప్రారంబోత్స‌వాలు చేయ‌నున్నారు.. ఈ నేప‌థ్యంలో ఆ రోజున నిర‌స‌న కార్యక్ర‌మాల‌కు బిఆర్ఎస్ పార్టీ పిలుపు ఇచ్చిది.. సింగ‌రేణి ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 8వ తేదీన సింగ‌రేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్ మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, కొత్త‌గూడెం, రామ‌గుండం ఏరియాల్లో మ‌హా ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

సింగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించ‌బోమ‌ని రామగుండంలో ప్ర‌ధాని మోడీ మాట ఇచ్చి త‌ప్పార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. లాభాల్లో ఉన్న సిగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అని ప్ర‌శ్నించారు. వేలం లేకుండా సింగ‌రేణికి బొగ్గు గ‌నులు కేటాయించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సంక‌ల్పాన్ని దెబ్బ‌తీసేందుకే కేంద్రం కుట్ర చేస్తుంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ‌కు సింగ‌రేణి ఓ ఆర్థిక‌, సామాజిక జీవ‌నాడి లాంటింద‌ని పేర్కొన్నారు. సింగ‌రేణి ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌కుంటే జంగ్ సైర‌న్ మోగిస్తాం.. మ‌రో ప్ర‌జా ఉద్య‌మం నిర్మిస్తామ‌ని కేటీఆర్ కేంద్రాన్ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement