ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లాలో రూ.3కోట్ల విలువైన బ్రౌన్ షుగర్ తోపాటు రూ.65 లక్షల నగదు, మూడు రివాల్వర్లను స్సెషల్ టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుందని క్రైమ్ బ్రాంచ్ సీనియర్ అధికారి సంజీవ్ పాండా తెలిపారు. ఒక అద్దె ఇంట్లో ఉంటున్న వ్యక్తిని సోదా చేయగా బ్రౌన్ షుగర్ దొరికిందని, అతన్ని అరెస్ట్ చేశామన్నారు. కాగా, అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తల కోసం వెతుకుతున్నట్టు చెప్పారు. అయితే ఆ ఇంటి నుండి ఎస్ టీ ఎఫ్ కొన్ని బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇతర జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు కొన్ని నెలలుగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ అద్దెకు ఉంటున్నాడు. అతను ఆ ప్రాంతంలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని క్రైం బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. నిందితుల అద్దె ఇంటిపై ఎస్టీఎఫ్ బృందం దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకుంది. కేసు వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన పాండా, నయాగర్ నుండి 3.1 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం జిల్లాలో ఇదే మొదటిదని అన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో బ్రౌన్ షుగర్ 3.1 కిలోలు, రూ.65.32 లక్షల నగదు, మూడు 7 ఎంఎం పిస్టల్, 7 మ్యాగజైన్, 43 రౌండ్ల 7 ఎంఎం మందుగుండు సామగ్రి, ఒక కౌంటింగ్ మెషిన్, 4 మొబైల్ ఫోన్లు, ఒక టాబ్లెట్ సెట్ ఉన్నట్లు ఎస్‌టీఎఫ్ తెలిపింది.
దీనికి సంబంధించి ఎన్‌డీపీఎస్ యాక్ట్తో పాటు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు. గత ఏడాది నుంచి నార్కోటిక్ డ్రగ్స్ పై చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో STF 47 కిలోల కంటే ఎక్కువ బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకుంది. 122 మంది డ్రగ్ డీలర్లు/పెడ్లర్లను అరెస్టు చేసింది. అదేవిధంగా అక్రమ ఆయుధాలకు వ్యతిరేకంగా నిర్వహించిన డ్రైవ్‌లో STF 67 తుపాకులను స్వాధీనం చేసుకుంది.