Tuesday, November 19, 2024

ప్ర‌ధాని మోడీ భ‌ద్ర‌తా ఘ‌ట‌న‌పై – ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసిన బ్రిటీష్ సిక్కు సంఘం

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పంజాబ్ ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌తా లోపం కార‌ణంగా ఆయ‌న ప‌ర్య‌ట‌నని ర‌ద్దు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న సంద‌ర్భంగా పంజాబ్ డీజీపీపై వేటు కూడా ప‌డింది. యూకే కేంద్రంగా ప‌ని చేస్తోన్న బ్రిటీష్ సిక్కు సంఘం స్పందించింది. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు అంత‌రాయం క‌లిగించిన గ్రూపుల‌పై ఆగ్ర‌మం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు బ్రిటీష్ సిక్కు సంఘం ఓ ప్ర‌క‌ట‌న‌ని రిలీజ్ చేసింది. మోడీ పర్యటనకు అంతరాయం కలిగించిన కొందరు దారి తప్పిన వ్యక్తులు.. పంజాబ్‌కు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధాని వచ్చారన్న సంగతిని గుర్తించాలని బ్రిటీష్ సిక్కు సంఘం ఛైర్మన్ లార్డ్ రామి డేంజర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్‌లో రూ.42,750 కోట్ల విలువైన అభివృద్ధి ప్రకటను ప్రధాని చేయాల్సి వుందని డేంజర్ అన్నారు. ఇంకా ఆ లేఖలో ఏమన్నారంటే.. ‘‘ ప్రధానమంత్రి భారత ప్రభుత్వానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధిపతి. ఆయన ఒక రాష్ట్రానికి కాకుండా దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తారు. దేశాన్ని నడిపించాల్సిన నాయకుడి అధికారాన్ని ఎవరూ అణగదొక్కకూడదు.

ప్రజలను కలవడానికి, పలకరించడానికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు ఆయన వచ్చారు. కొందరు గుంపు కారణంగా మోడీ పర్యటనకు ఆటంకం కలిగింది. అదే సమయంలో పార్లమెంట్‌లో తన బలం కోసం ప్రధాని పంజాబ్‌పై మాత్రమే ఆధారపడలేదని బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ గుర్తుచేసింది.వాస్తవానికి పంజాబ్ భవిష్యత్తు, అభివృద్ధి ప్రధానమంత్రి చిత్తశుద్ధిపై ఆధారపడి వుంటుంది. సరిహద్దు రాష్ట్రంగా వున్నందున, ఉగ్రవాదం.. పక్కదేశం సరఫరా చేసే మాదక ద్రవ్యాలపై పోరాడటానికి పంజాబ్‌కు కేంద్రం సహాయం ఆవశ్యకమని బ్రిటీష్ సిక్కు అసోసియేషన్ తెలిపింది. పంజాబ్ నాయకులు ప్రధానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చినందుకు సానుభూతి చూపాలని పిలుపునిచ్చింది. దీనిపై త్వరలోనే గుణపాఠం నేర్చుకుంటారని అసోసియేషన్ ఆకాంక్షించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement