Wednesday, November 20, 2024

British Airways | విమాన​ సిబ్బందికి జంప్​సూట్​, హెడ్​స్కార్ప్​ ఆప్షన్స్​.. కొత్త డ్రెస్​ కోడ్​ రిలీజ్​ చేసిన సంస్థ

బ్రిటీష్ ఎయిర్‌వేస్ తన 20 ఏండ్ల కాలంలో ఫస్ట్​ టైమ్​ కొత్త యూనిఫామ్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఆధునిక సూట్ ఎయిర్‌లైన్స్ లో మొదటిది కావడం ఎంతో గొప్పదని ఆ సంస్థ సీఈవో అంటున్నారు. ట్యూనిక్, జంప్‌సూట్.. హెడ్‌స్కార్ఫ్ తో కూడిన డ్రెస్​ మోడల్స్​ ఎంతో బాగున్నాయని చెబుతున్నారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ 2004 నుండి కొత్త డ్రెస్​ని రూపొందించే పనిలో పడింది. బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ ఓజ్వాల్డ్ బోటెంగ్ రూపొందించిన ఈ కొత్త మోడల్స్​ని చాలామంది లైక్​ చేస్తున్నారు. అయితే.. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ డ్రెస్​ మోడల్స్​ విడుదల చేయడం చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది.

సంస్థ నిర్వహించిన 50వ వర్క్ షాప్‌లో 1,500 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్గో విమానాలలో ఉద్యోగులు గత ఆరు నెలలుగా యూనిఫామ్‌లను రహస్యంగా పరీక్షించారు. కొత్త డ్రెస్​ మోడల్​లో పురుషులు సాధారణ లేదా స్లిమ్ ఫిట్ ప్యాంటుతో ప్రత్యేకంగా రూపొందించిన త్రీ-పీస్ సూట్​లో ఎంతో హ్యాండ్​సమ్​గా కనిపిస్తున్నారు. ఇక.. మహిళలు స్కర్ట్ లేదా ట్రౌజర్‌లను ధరించేందుకు ఆసక్తిగా ఉన్నారు. క్యారియర్ కోసం ట్యూనిక్, హెడ్‌స్కార్ఫ్ ఎంపిక కూడా రెడీ చేశారు.

30,000 కంటే ఎక్కువ మంది ఎయిర్‌లైన్ ఉద్యోగులు కొత్త యూనిఫాంను 2023 మార్చి నుంచి ధరిస్తారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటిష్​ ఎయిర్​ వేస్​ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన సీన్ డోయల్ ఇలా అన్నారు.. “మా యూనిఫాం.. మా బ్రాండ్‌కు ఒక ఐకానిక్ గా ఉంటుంది. ఇది బ్రిటిష్​ ఎయిర్​లైన్స్​ ఫ్యూచర్​ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఆధునిక బ్రిటన్‌లో అత్యుత్తమమైన మోడల్​గా ఉంటుంది. మరింత అద్భుతంగా తీర్చిదిద్దడంలో మాకు సహాయపడుతుంది. మా వినియోగదారులకు ప్రామాణికమైన బ్రిటిష్ సేవ.”అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement