Wednesday, November 20, 2024

ఒమిక్రాన్ పై బ్రిటన్ యుద్ధం… మూడో డోస్ కు సిద్ధం!

లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ పై బ్రిటన్ యుద్ధం ప్రకటించింది. రోజుల వ్యవధిలో తన పౌరులందరికీ బూస్టర్ డోస్ ను అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 40 ఏళ్ల పైబడిన వారికి ముందు జాగ్రత్త చర్యగా లక్షలాది మందికి బూస్టర్ డోస్ వేసేసింది. తాజాగా ఒమిక్రాన్ కొవిడ్ రకం విజృంభిస్తుండడంతో బ్రిటన్ లో ఆందోళనలు మొదలయ్యాయి. క్రిస్మస్ వేళ మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు వస్తాయేమోనన్న భయాలు మిన్నంటాయి. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని వారాల వ్యవధిలో బ్రిటిషర్లందరికీ వ్యాక్సిన్ల మూడో డోస్ ను బూస్టర్ డోస్ గా అందించి ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించాలని నిర్ణయించింది.

అయితే ఈలోగా ఒమిక్రాన్ ను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ట్రావెల్ బ్యాన్ విధించడంతో పాటు మాస్క్ లను ధరించడం తప్పనిసరి చేసింది. భౌతికదూరాన్నీ పాటించాల్సిందే. హోటళ్లు, చర్చ్ లు, తదితర రద్దీ ప్రదేశాల్లో గుమికూడడాన్ని నిషేధించింది. మాస్క్ లను ధరించని వారి భరతం పట్టాలని పోలీసులను ఆదేశించింది. మాస్క్ ధరించకుండా బహిరంగంగా తిరిగితే సీసీ కెమెరాలకు చిక్కినా 200 నుంచి గరిష్టంగా 6400 పౌండ్లు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే గరిష్టంగా 6400 రూపాయలు. వ్యాక్సిన్లను మూడో డోస్ కు సిద్ధం చేయడంతో పాటు నియంత్రణ చర్యలను తీసుకుంటున్న బ్రిటన్ ను అభినందించాల్సిందే…

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement