బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. మూడో పెళ్లి చేసుకున్నారు. క్యారీ సైమండ్స్‌ను ఆయన పెళ్లాడారు. శనివారం మధ్యాహ్నం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్‌లో ఈ వివాహ జరిగిన్లు బ్రిటన్ మీడియా వెల్లడించింది. బోరిస్ జాన్సన్ రహస్యంగా వివాహం చేసుకున్నారని, అత్యంత ఆప్తులు పరిమితంగా మాత్రమే దీనికి హాజరైనట్లు అక్కడి మీడియా పేర్కొంది. కొవిడ్ నిబంధనలు అమలులో ఉండడంతో వివాహ కార్యక్రమానికి 30 మందికి మాత్రమే హాజరైనట్లు తెలిపింది.
బోరిస్ జాన్సన్‌కు ఇది మూడో వివాహం. ఇదివరకే ఆయనకు రెండుసార్లు వివాహమైంది. న్యాయవాది మెరినా వీలర్‌ను ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. నలుగురు సంతానం. 2018 సెప్టెంబర్‌లో బోరిస్ జాన్సన్, వీలర్ విడిపోయారు. ఆ తరువాత 2019లో జాన్సన్.. క్యారీ సైమండ్స్‌తో సహజీవనం చేస్తున్నారు. బోరిస్ జాన్సన్ కి 56 ఏళ్లు కాగా.. క్యారీ సైమండ్స్‌కు 33 సంవత్సరాలు. వీరికి ఇప్పటికే ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. బ్రిటన్‌లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీలో సైమండ్స్ క్రియాశీలకంగా పనిచేస్తోన్నారు. 2019లో జాన్సన్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరూ డౌనింగ్ స్ట్రీట్లో కలిసి నివసిస్తున్నారు.