బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ ఆర్మీకి 6వేల మిస్సైళ్లు,25మిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. కాగా ఇందులో మిలిటరీ హార్డ్‌వేర్, యాంటీ ట్యాంక్, అత్యధిక పేలుడు సామర్థ్యం కలిగిన ఆయుధాలు ఉంటాయన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించడానికి నాటో, జీ7 దేశాలు సమావేశమవుతున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఈ మేరకు ప్రకటించారు.ఉక్రెయిన్‌కు మెరుగైన రక్షణాత్మక మద్దతులను అందించడంతోపాటు రష్యాపై ఆర్థిక పరమైన ఆంక్షలు రెట్టింపు చేయాలని పాశ్చాత్య దేశాలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను మరింతగా పెంచడానికి తమ భాగస్వామ పక్షాలతో కలిసి పనిచేయనన్నామని చెప్పారు. రష్యన్ సైనికులు ఉక్రెయిన్ పట్టణాలు, నగరాలను ధ్వసం చేస్తుండగా తాము చూస్తూ ఉండలేమని, మాస్కో సైనికులను ఎదుర్కొవడానికి కీవ్‌కు మరింత సహాయం అందిస్తామని చెప్పారు. కాగా, బ్రిటన్ ఇప్పటికే 4 వేల యాంటీ ట్యాంక్ మిస్సైల్స్, జావెలిన్ క్షిపనులను ఉక్రెయిన్ సైన్యానికి అందించింది. అదేవిధంగా మానవాద దృక్పదంతో 400 మిలియన్ ఫౌండ్ల ఆర్థిక సహాయం అందిస్తామని గతంలో ప్రకటించింది.
ఉక్రెయిన్ ఆర్మీకి ‘బ్రిటన్’ మరింత సాయం – ప్రకటించిన ప్రధాని ‘బోరిస్ జాన్సన్’
Advertisement
తాజా వార్తలు
Advertisement