Friday, November 22, 2024

Omicron: బ్రిటన్ లో 160 ఒమిక్రాన్ కేసులు.. ప్రయాణ ఆంక్షలు మరింత కఠినతరం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్.. ఇప్పటివరకు 38కిపైగా దేశాలకు పాకింది. బ్రిటన్‌లో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 160 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలోనే వైరస్ గుర్తించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధించింది. బ్రిటన్‌కు వచ్చేవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచుతామని, ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్.. చేప కింద నీరులా విజృంభిస్తోంది. తక్కువ వ్యవధిలోనే వేగంగా విస్తరిస్తున్న ఈ ఒమిక్రాన్.. ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాపించింది. నవంబర్ 24న తొలిసారి కొత్త రకం వేరియంట్ B.1.1.529ను గుర్తించినట్టు దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ తరువాత బోట్సవానా, హాంకాంగ్ నమీబియా దేశాలలో ఈ రకం కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం భారత్ సహా 38 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది.

డెల్టా వేరియంట్ కంటే ఐదురెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. భారత్ తోపాటు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, హాంకాంగ్, కెనడా, అమెరికా, సౌదీ అరేబియా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, పాకిస్థాన్, చెక్ రిపబ్లిక్, నార్వే, ఫిన్లాండ్, యూకే, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఆస్ట్రియా, ఇజ్రాయేల్, నైజీరియా, ఘనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, గ్రీస్, బ్రెజిల్ తదితర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement