ఈ మధ్యాకాలంలో వివాహ వేడుకకి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ చేయించుకోవడం పరిపాటిగా మారింది. ఈ ప్రీ వెడ్డింగ్ కాస్త వెరైటీగా జరిగింది. పెళ్లి కూతురు గెటప్ లోనే జిమ్ లో కసరత్తులు చేస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకుంది. తమిళనాడుకు చెందిన ఓ యువతి.. తన పెళ్లికి ముందు ఇలా డిఫరెంట్ గా ఫోటో షూట్ ప్లాన్ చేసింది. దీనికి ఫోటో గ్రాఫర్లు.. వీడియో గ్రాఫర్లు కూడా నవ్వుతూ, సరదాగానే స్పందించారు. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ల కల్చర్లో ఇప్పుడు ఇది ట్రెండ్ గా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. మరి దీనిపై వరుడు ఎలా స్పందించాడో.. కాస్త పాత తరం, పట్టింపులు ఎక్కువగా ఉండే అత్తగారు అయితే.. వారెలా స్పందించేవారో.. కానీ ఇప్పటికైతే ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీన్ని ఐపీఎస్ ఆఫీసర్ రుపిన్ శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో వెంటనే ట్వీట్లు, రీట్వీట్లు.. షేర్స్, లైక్స్ తో దూసుకుపోతోంది ఈ వీడియో. బాహుబలి కోడలు అంటూ.. జమానా మారింది అంటూ కామెంట్ల వరద కొనసాగింది. ఈ వీడియోను సంయుక్త అనే మరో ట్విట్టర్ యూజర్ షేర్ చేస్తూ.. ఇదేంటీ.. భర్త, అత్తింటివారికి క్లియర్ హెచ్చరికా అంటూ సరదా కామెంట్ చేస్తూ పోస్ట్ చేసింది. అంతే దీనిమీద కూడా కామెంట్ల వరద కొనసాగుతోంది. అఫ్ కోర్స్ నెగటివ్ కామెంట్స్ లేకపోతే అది సోషల్ మీడియానే కాదు.. వాటితో పాటు.. సరదాగా ‘అత్తింటివారి పని అయిపోయింది’.. ‘ఇక వారికి చుక్కలే’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement