Saturday, November 23, 2024

ఇటుక‌ల్లో – రూ.27కోట్ల విలువైన హెరాయిన్

రాను రాను స్మ‌గ్ల‌ర్ల తెలివితేట‌లు శృతి మించుతున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా డ్ర‌గ్స్ ని కొత్త దారుల్లో స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. కాగా పంజాబ్ లోని అమృత్ స‌ర్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ముందు జవాన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో వారికి కొన్ని ఇటుకలు, రెండు బోలు పంపులు లభించాయి. ఇటుకలు కాస్త వింతగా కనిపించాయి. సైనికులు దానిని బద్దలు కొట్టి చూసిన వారికి ఊహించని విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి, వాటిని చూసి సైనికులందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఇటుకలను హెరాయిన్‌తో త‌యారు చేశారు. బోలు పంపుల్లో కూడా హెరాయిన్ లభ్యమైంది. ఈ విషయాన్ని సైనికులు వెంటనే ఉన్నతాధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టారు. దీని తరువాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించారు. బీఎస్ఎఫ్ జవాన్లు హెరాయిన్ నింపిన మొత్తం 8 ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రెండు హాలో పంపులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 3.870 కిలోల హెరాయిన్ ల‌భ్య‌మైంది. దీని అంతర్జాతీయ ధర రూ. 27 కోట్లు ఉంటుందని అంచనా. అయితే భారత భూభాగంలో హెరాయిన్‌ను ఇటుకలలో నింపడం ఇదే మొదటిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement