Tuesday, November 26, 2024

స‌ముద్రంలో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని ఎలా కాపాడారో తెలుసా

స‌ముద్ర‌తీరంలో కొట్టుకుపోతున్న ఓ వ్య‌క్తిని చాక‌చ‌క్యంతో కాపాడారు స్థానికులు. స‌ముద్ర‌తీరంలో ఎంజాయ్ చేద్దామ‌ని ప‌ర్యాట‌కులు వ‌చ్చారు. అల‌ల తాకిడికి ఓ వ్య‌క్తి స‌ముద్రంలోకి కొట్టుకుపోయాడు ప్ర‌మాద‌వ‌శాత్తు. ఈ విష‌యాన్ని గుర్తించిన మిగ‌తా ప‌ర్యాట‌కులు వెంట‌నే స్పందించి మాన‌వ‌హారాన్ని ఏర్పాటు చేసి ఆ వ్య‌క్తిని ఒడ్డుకు చేర్చారు. ఈ ఘ‌ట‌న ఫిలిప్పీన్స్ లోని బిన్మలే బీచ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మునిగిపోతోన్న వ్య‌క్తిని కాపాడ‌డానికి తోటి ప‌ర్యాట‌కులు అంతా క‌లిసి శ‌ర‌వేగంగా మాన‌వ హారం క‌ట్టి కాపాడిన తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement