అర్హులందరికీ సాయం అందాలని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నదే ఉద్దేశ్యమని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఓ ఒక్కరూ మిస్ కాకూడదన్నారు. గత ప్రభుత్వాలు కట్ చేయాలని చూశాయి. వైసీపీ ప్రభుత్వం అలా కాదని విప్లవాత్మకంగా వెళ్తుందని జగన్ అన్నారు. 12పథకాల్లో 9.30లక్షల మందికి రూ.702కోట్ల సాయం అందించనున్నారు. ఈ పథకాలకు ఏ ఒక్కరూ మిస్ కాకుడదన్నారు. వైఎస్ ఆర్ చేయూత కింద 2.50లక్షల మందికి రూ.470కోట్లు,రైతు భరోసా కింద 2.86లక్షల మందికి రూ.59కోట్లు, కులం,మతం,పార్టీ చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో 39లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు 61లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని జగన్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ 2500అవుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..