తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షని ప్రారంభించారు. రైతులకు అండగా ఉండేందుకు షర్మిల ఈ దీక్ష చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 72 గంటల పాటు ఆమె ఈ దీక్ష చేపట్టనున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన నిరాహారదీక్షకు చేయనున్నారు. మిగతా 48 గంటలు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఈ దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దొంగ నీవంటే నీవంటూ బీజేపీ,టీఆర్ ఎస్ పార్టీలు అనుకుంటూ రైతులకు సున్నంపెడుతున్నాయన్నారు. రైతులు చనిపోతున్నా కేసీఆర్ లో చలనం లేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో ధర్నాలు చేస్తే ఒదిగేదేముందని మండిపడ్డారు. దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయమని తెలిపారు.
Breaking : కేసీఆర్ పై మండిపడ్డ షర్మిల..దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయమని పిలుపు..
Advertisement
తాజా వార్తలు
Advertisement