గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గెలుపుకోసం పనిచేయాలని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సూచించాడని తెలిపింది సునీత అనే యువతి. అయితే ఆయన చెప్పినట్టే తాను చేశానని.. వాసు తనని మోసం ఈ సమయంలోనే గీతా ఆర్ట్స్ లో సినిమాలు ఇప్పిస్తానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకున్నాడని సునీత ఆరోపిస్తోంది. తాను జనసేన పార్టీకోసం పనిచేసాను కాబట్టి అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు గోడు చెప్పుకోవడానికి మంగళగిరి జనసేన ఆఫీస్ కు వచ్చినట్లు బోయ సునీత తెలిపారు. కాని ఆఫీస్ సిబ్బంది తనను లోపలికి రానివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. తనకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్‌కు విజ్ణప్తి చేస్తూ జనసేన కార్యాలయం బయట సునీత నిరసన చేపట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..