మండపేట : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జనసేన పి ఏ సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా మండపేట బాబు అండ్ బాబు కన్వర్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసే భారీ స్కామ్ చేపట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఈ జిల్లాకు చెందిన వైకాపా నేత డైరెక్షన్ లో భారీ కుంభకోణం చేపట్టారని దీన్ని ఆధారాలతో సహా వెల్లడిస్తామని పేర్కొన్నారు. జనసేన ఆధ్వర్యంలో ప్రధానం గా మూడు సమస్య లపై పోరాటం చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రహదారుల దుస్థితి, నష్ట పోయిన రైతాంగానికి న్యాయం, ఓ టీఎస్ లో నిర్బంధ వసూళ్లు పై తాము పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. జన సేన రోడ్ లపై పోరాటం చేస్తే గాని అతి గతి లేదన్నారు.ప్రజా సమస్యలపై స్పందించని ఏకైక ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే నని ఎద్దేవా చేశారు.
రూ.13 వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కనీసం రోడ్ లు మరమ్మతులు చేయాలేని నిస్సహాయతలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఎవరి కోసం ఈ ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు. ప్రజల నుండి పన్నులు వసూలు చేసి కనీస రహదారి వంటి వసతులు కూడా కల్పించక పోవడం దురదృష్టం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. బకాయిలు చెల్లించక పోవడంతో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదని ఇది ప్రభుత్వ దివాళా కోరు తనానికి నిదర్శనం అన్నారు. ఈ జిల్లా కు సంబంధించిన పెద్ద వ్యక్తులు రైతు కు వ్యతిరేకంగా భారీ స్కామ్ చేపట్టి రైతులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కౌలు రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి లో అధికారులు నష్టం అంచనా వేయడంలో విఫలమయ్యారు.ముఖ్యమంత్రి లాప్ టాప్ తీసుకుని గదిలో కూర్చొని వేల కోట్లు ఖాతాల్లో వేశామని చపట్లు కోడుతున్నారని ఎద్దేవా చేశారు. స్వార్ధం లేకుండా పని చేయాల్సిన ప్రభుత్వం సమస్యలు నుండి పారిపోతున్నారని ఆరోపించారు. జిల్లా లో రూ 200 కోట్లు మరమ్మతులు కు వస్తే వెంటనే ప్రభుత్వం లాగేసుకుందని ఆరోపించారు.ఈ సమావేశంలో జనసేన ఇన్ ఛార్జ్ లు వేగుళ్ళ లీలాకృష్ణ, మరెడ్డి శ్రీనివాస్, కందుల దుర్గేష్,పంతం నానాజీ,శెట్టి బత్తుల రాజబాబు, ముత్తా శశిధర్, బండారు శ్రీనివాస్, పొలిశెట్టి చంద్ర శేఖర్, సురపు రెడ్డి సత్య,జనసేన నాయకులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..