Friday, November 22, 2024

Breaking : కార్మికుల‌ను మిలిటెంట్లుగా పొర‌బ‌డి కాల్పులు .. 13మంది మృతి ..11మందికి గాయాలు ..

నాగాలాండ్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వేర్పాటు వాదులనే అనుమానంతో యువ‌కుల‌పై జ‌వాన్లు కాల్పులు జ‌రిపారు. కోల్ ఫీల్డ్ నుంచి తిరిగి వ‌స్తుండ‌గా కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో 13మంది మృతి చెందారు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై మండిప‌డ్డారు స్థానికులు. కోపోద్రిక్తుల‌యిన గ్రామ‌స్తులు ఆర్మీ వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు. దాంతో సిట్ విచార‌ణ‌కు ఆదేశించారు నాగాలాండ్ సీఎం నెయ్‌ప్యూ రాయ్. ఈ ఘ‌ట‌న‌లో 11మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మోన్ జిల్లా ఓటింగ్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారందరూ బొగ్గు గని కార్మికులుగా గుర్తించారు. వారు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మిలిటెంట్ల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. అదే సమయంలో పనులు ముగించుకుని వస్తున్న కార్మికులను మిలిటెంట్లుగా పొరబడిన భద్రతా దళాలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 11 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement