ఓ ఇద్దరు మహిళా ఖైదీలు జైలులోనే గర్భం దాల్చారు. వారిద్దరు ట్రాన్స్ జెండర్స్ కావడంతో వారు శృంగారంలో పాల్గొనగా ప్రెగ్నెంట్ అయినట్టు సమాచారం. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అక్కడ కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. పురుషులకు అసలు అనుమతే లేని ఆ జైల్లోని ఇద్దరు మహిళా ఖైదీలు గర్భం దాల్చాడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది. దీంతో.. ఏం చేయాలో పాలుపోక జైలు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జైలు నిబంధనలే ఈ పరిస్థితికి దారి తీసాయి. వీటి ప్రకారం.. తాము పురుషులమని భావించేవారు పురుషుల జైల్లో.. మహిళలమని నమ్మేవారు మహిళల జైల్లో ఉండేందుకు హక్కు ఉంది. ఈ క్రమంలో డెమీ మైనర్ అనే ట్రాన్స్ జెండర్ తాను మహిళల జైల్లోనే ఉంటానని తెలిపింది. దీంతో.. జైలు అధికారులు ఇందుకు అంగీకరించారు. అయితే అప్పటికి ఆ ట్రాన్‌జెండర్‌కు లింగ మార్పిడి ఆపరేషన్ జరగలేదు. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఖైదీలతో ట్రాన్స్ జెండర్ మహిళ శారీరకంగా కలవడంతో వారు గర్భవతులయ్యారు. అయితే.. ఇదంతా పరస్పర ఆమోదంతోనే జరిగిందని ఇద్దరు మహిళా ఖైదీలు స్పష్టం చేశారు. అంధకారమైపోయిన తమ జీవితాల్లో వెలుగు రేఖలా ప్రేమ భావన ప్రవేశించిందని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement