ప్రపంచాన్ని మళ్లీ కుదిపేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంటే ఎందుకంత భయం నెలకొంది. వైద్య నిపుణులు, సైంటిస్టులు ఏం చెబుతున్నారు. ఇప్పటి వరకు మనం తీసుకుంటున్న జాగ్రత్తలు సరిపోవా.. మనలో ఉన్న ఇమ్యూనిటీ పనిచేయదా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేదిస్తున్నాయి. భయం గొలిపే పలు విషయాలు వెల్లడవుతున్నాయి. అసలు ఒమిక్రాన్ వైరస్ ఎందుకింత ప్రమాదకరమో.. వైద్య నిపుణులు ఏమంటున్నారో చదివి తెలుసుకుందాం..
నిన్నటి దాకా ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా ఇప్పుడు కొత్త రూపంలో సరికొత్తగా మన ముందుకొచ్చి సవాల్ విసురుతోంది. వైరస్ మరోసారి మ్యూటెంట్ చెంది కొత్త వేరియంట్‌తో దాడి చేస్తోంది. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడేలా చేస్తోంది. సెకండ్ ఫేజ్ డెల్టా వేరియంట్ కంటే మరీ ఇది డేంజర్ అని తేలడంతో ప్రపంచమంతా వణికిపోతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పిటికే యూరప్ సహా చాలా దేశాల్లో విస్తరించిందని తెలుస్తోంది. వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలు పెడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒమిక్రాన్ వైరస్ ఎంత ప్రమాదకరమో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వివరిస్తున్నారు.
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి వివరించారు డాక్టర్ రణదీప్ గులేరియా. స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో ఒమిక్రాన్ 30కి పైగా మ్యూటేషన్లు కలిగి ఉందని గులేరియా తెలిపారు. స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలోని వేరియంట్లు రోగ నిరోధకతను తప్పించుకునే యంత్రాంగాన్ని కలిగి ఉన్నాయని..ఇది పూర్తిగా ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాల్ని రూపొందించేందుకు చాలా వ్యాక్సిన్లు పని చేస్తాయని..అందుకే కొవిడ్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని వ్యాక్సిన్లను సమీక్షించాల్సి ఉందన్నారు.
ఇప్పుడున్న వ్యాక్సిన్ పనిచేయదా
ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో అనేక మ్యూటేషన్లు ఉన్నందున చాలా రకాల వ్యాక్సిన్లను అధిగించేస్తుందని డాక్టర్ గులేరియా సందేహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో 30 కంటే ఎక్కువసార్లు మ్యూటేట్ అయినట్టు గుర్తించారు. ఫలితంగా మనిషిలోని రోగ నిరోధకత ఎస్కేప్ మెకానిజమ్‌లను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో ఉన్న మ్యూటేషన్లు కొవిడ్ వ్యాక్సిన్ సామర్ద్యాన్ని తగ్గించేందుకు దారి తీయవచ్చని గులేరియా చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీన తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ప్రమాదకరమైందిగా గుర్తించింది. ఈ వేరియంట్ ఇప్పటి వరకు యూకే, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో విస్తరించింది. అదృష్టవశాత్తూ ఇండియాలో ఈ వేరియంట్‌కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని.. పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రధాని మోడీ చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..